అత్తగారింటికి వెళ్లిన నాకు హారతి పళ్లెంకు బదులు చెప్పుతో కొట్టారు : రేఖ

వెండితెరపై ఓ వెలుగు వెలిగిన నటి రేఖ. ఈమె ఎన్నో సంచలనాలు సృష్టించారు. అలాగే, తన వ్యక్తిగత జీవితంలోనూ అన్నే సంచలనాలే ఉన్నాయి. ఇప్పుడు వాటన్నింటిని కూర్చి ఆత్మకథ రూపంలో వెలువరించారు. యాస్మిన్‌ ఉస్మాన్‌ ర

rekha
pnr| Last Updated: మంగళవారం, 27 సెప్టెంబరు 2016 (13:38 IST)
వెండితెరపై ఓ వెలుగు వెలిగిన నటి రేఖ. ఈమె ఎన్నో సంచలనాలు సృష్టించారు. అలాగే, తన వ్యక్తిగత జీవితంలోనూ అన్నే సంచలనాలే ఉన్నాయి. ఇప్పుడు వాటన్నింటిని కూర్చి ఆత్మకథ రూపంలో వెలువరించారు. యాస్మిన్‌ ఉస్మాన్‌ రాసిన ‘రేఖా...ద అన్‌టోల్డ్‌ స్టోరీ’లో బోలెడన్ని రహస్యాలు దాగి ఉన్నట్టు సమాచారం.

ముఖ్యంగా ప్రేమ, పెళ్ళి వ్యవహారంలో రేఖ పడిన ఇబ్బందులు, అవమానాలు ఇందులో విపులంగా పొందుపరిచినట్టు సమాచారం. రేఖ మొదట వినోద్‌ మెహ్రాను పెళ్ళిచేసుకుంది. అత్తగారింటికి వెళ్ళిన రేఖకు హారతి పళ్ళెం బదులు చెప్పు దెబ్బలు ఎదురయ్యాయట.

ఎందుకంటే.. రేఖను పెళ్ళి చేసుకోవడం వినోద్‌ తల్లికి ఏమాత్రం ఇష్టం లేదట. దాంతో గడపలో అడుగుపెట్టిన కొత్త కోడలిని చెప్పుతో కొట్టి వెళ్ళగొట్టిందట. బయటి ప్రపంచానికి పెద్దగా తెలియని ఎన్నో విషయాలు ఆ పుస్తకంలో ఉన్నాయట.దీనిపై మరింత చదవండి :