సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : సోమవారం, 17 జూన్ 2019 (11:51 IST)

ఓ జర్నలిస్టూ.. ఓ నువ్వూ ఓ తల్లికేగా పుట్టి వుంటావ్?: రేణూ దేశాయ్

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మాజీ భార్య రేణూ దేశాయ్‌ అప్పుడప్పుడు నెటిజన్లపై, మీడియాపై మండిపడుతూ వుంటారు. ముఖ్యంగా పవన్ ఫ్యాన్స్ నుంచి ఆమె ఎదుర్కొన్న బెదిరింపులు గురించి ప్రత్యేకంగా ఇంటర్వ్యూల్లోనూ చెప్పారు. పవర్ స్టార్ నుంచి దూరమైన రేణూ దేశాయ్ పిల్లలతో కలిసి వుంటున్న సంగతి తెలిసిందే. అంతేగాకుండా రెండో పెళ్లి చేసుకునేందుకు కూడా సిద్ధపడ్డారు 
 
ఈ నేపథ్యంలో పవన్ ఫ్యాన్స్ ఆమెను సోషల్ మీడియాలో ట్రోల్ చేశారు. ఇలా ట్రోల్ చేసిన వారిపై రేణూ దేశాయ్ గతంలో మండిపడ్డారు. ప్రస్తుతం సినిమాలతో బిజీ బిజీగా వున్న రేణూ దేశాయ్.. మీడియా వ్యవహారశైలిపై తీవ్రంగా మండిపడ్డారు. రేణుదేశాయ్ ఇటీవల తన ఇద్దరు పిల్లలతో కలిసి శ్రీనగర్, జమ్మూ సహా పలు ప్రాంతాల్లో పర్యటించారు. 
 
ఈ వార్తను ఓ వైబ్ సైట్ కవర్ చేసింది. ఆ వార్తలో ‘పవన్ కల్యాణ్ పిల్లలతో మాజీ భార్య రేణుదేశాయ్’ అని టైటిల్ పెట్టాడు. దీనిపై రేణుదేశాయ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఆర్టికల్‌ను ఇప్పుడే చూశాను. ఈ ఆర్టికల్ రాసిన వ్యక్తి ఓ తల్లికేగా పుట్టి వుంటాడని ప్రశ్నించారు. ఒక తల్లిని ఎలా బాధ పెడుతున్నాడు ఇప్పుడు? అని రేణూదేశాయ్ ఫేస్‌బుక్‌లో ఆమె ఫైర్ అయ్యారు.