శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 4 డిశెంబరు 2021 (20:50 IST)

ఆర్ఆర్ఆర్ నుంచి లేటెస్ట్ అప్డేట్.. ట్రైలర్ డిసెంబర్ 9న వస్తుందా?

ఆర్ఆర్ఆర్ సినిమా విడుదలకు సిద్ధం అవుతోంది. ఈ సినిమా ట్రైలర్ కోసం ఫ్యాన్స్ ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. నిజానికి డిసెంబ‌ర్ 3న ఆర్ఆర్ఆర్ ట్రైల‌ర్‌ను విడుల చేయాల‌ని అనుకున్నారు. కానీ సాంకేతిక కార‌ణాలేమో ఏమో కానీ ట్రైల‌ర్ రిలీజ్‌ను వాయిదా వేస్తామ‌ని ప్ర‌క‌టించారు. 
 
తాజా సమాచారం మేరకు డిసెంబర్ 9న ఆర్ఆర్ఆర్ ట్రైలర్ విడుదల చేయాలని జక్కన్న అండ్ టీమ్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ట్రైల‌ర్ విడుద‌ల కోసం ఇటు మెగా.. అటు నంద‌మూరి అభిమానులు క‌ళ్లు కాయ‌లు కాచేలా ఎదురుచూస్తున్నారు. మరి ఈసారైనా జక్కన్న అనుకున్న టైమ్‌కి వస్తాడా? అనేది తెలియడం లేదు. 
 
ఆర్ఆర్ఆర్ సినిమాలో టాలీవుడ్‌కి చెందిన అగ్ర క‌థానాయ‌కులు ఎన్టీఆర్, రామ్ చ‌ర‌ణ్‌ల‌తో పాటు బాలీవుడ్‌కి చెందిన ఆలియా భ‌ట్‌, అజ‌య్ దేవ‌గ‌న్ కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. మ‌రోవైపు హాలీవుడ్ నుంచి ఒలివియా మోరిస్‌, అలిస‌న్ డూడి, రే స్టీవెన్ స‌న్ వంటి స్టార్స్ కూడా నటించారు. 
 
డివివి ఎంట‌ర్‌టైన్‌మెంట్‌పై డివివి దాన‌య్య ఈ సినిమాను నిర్మిస్తున్నారు. రూ.400 కోట్ల‌కు పై బ‌డ్జెట్‌తో నిర్మించిన చిత్ర‌మిది. ప్ర‌పంచ వ్యాప్తంగా దాదాపు ప‌ది వేల థియేట‌ర్స్‌లో సినిమాను విడుద‌ల చేసే అవ‌కాశం ఉందని, ఇండియాలో ఇప్ప‌టి వ‌ర‌కు ఏ సినిమా కూడా ఇన్ని స్క్రీన్స్‌లో విడుద‌ల కాకుండా త‌గు చ‌ర్య‌లు తీసుకుంటున్నార‌ట‌. తెలంగాణ గోండు వీరుడు కొమురం భీమ్‌గా ఎన్టీఆర్‌, మ‌న్యం వీరుడు అల్లూరి సీతారామ‌రాజుగా రామ్‌చ‌ర‌ణ్ న‌టించారు.