శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By కుమార్
Last Updated : సోమవారం, 11 మార్చి 2019 (19:13 IST)

స్వాతంత్రోద్యమ నేపథ్యంలో ట్రిపుల్ ఆర్..?

దర్శకధీరుడు రాజమౌళి యంగ్ టైగర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిస్తున్న భారీ మల్టీస్టారర్ చిత్రం ఆర్ఆర్ఆర్‌తో సంచలనాలు సృష్టించేందుకు సిద్ధమవుతోంది. ఈ చిత్రం స్వాతంత్రోద్యమ నేపథ్యంలో ఉండబోతోందనే విషయం ఇప్పటికే తెలిసింది. తాజాగా ఈ చిత్రానికి జరుగుతున్న బిజినెస్ ఆశ్చర్యపరుస్తోంది. 
 
ఈ చిత్రాన్ని ప్రారంభించిన నెల రోజులకే చిత్ర నిర్మాతకు శాటిలైట్స్ రైట్స్ ద్వారా 150 కోట్ల ఆఫర్ వచ్చినట్లు సమాచారం. తాజాగా థియేట్రికల్ హక్కుల కోసం బయ్యర్లు ఎగబడుతున్నట్లు సమాచారం. ఎంత ఎక్కువ మొత్తమైనా సినిమాను తీసుకునేందుకు బయ్యర్లు పోటీపడుతున్నారట.
 
ఇలా ఉండగా ఈ సినిమా ఓవర్సీస్ హక్కులను దక్కించుకునేందుకు ఓ సంస్థ 75 కోట్ల రూపాయలను ఆఫర్ చేసినట్లు సమాచారం. ఓవర్సీస్‌లో 75 కోట్లు అంటే నిజంగా చాలా పెద్ద మొత్తమనే చెప్పుకోవాలి. అయితే రాజమౌళి సినిమా కావడం, హీరోలిద్దరికీ మంచి క్రేజ్ ఉండటంతో బయ్యర్లు ఎంత ఖర్చుకైనా వెనుకాడటంలేదని సమాచారం. ఈ డీల్ కుదిరితే రామ్‌చరణ్, ఎన్టీఆర్ కెరీర్లోనే ఇది అతిపెద్ద ఓవర్సీస్ బిజినెస్ అవుతుంది.