బుధవారం, 1 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : మంగళవారం, 20 జూన్ 2023 (12:43 IST)

మను చరిత్రలో ఆర్ఎక్స్100 వైబ్స్ కనిపిస్తున్నాయ్ : హీరో కార్తికేయ

Karthikeya, Siva Kandukuri, Bharat Pedagani, Priya Vadlamani
Karthikeya, Siva Kandukuri, Bharat Pedagani, Priya Vadlamani
శివ కందుకూరి కథానాయకుడిగా నూతన దర్శకుడు భరత్ పెదగాని దర్శకత్వంలో తెరకెక్కిన ఇంటెన్స్ లవ్ స్టొరీ ‘మను చరిత్ర.ప్రొద్దుటూరు టాకీస్ బ్యానర్ పై ఎన్ శ్రీనివాస రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రంలో మేఘా ఆకాష్, ప్రియా వడ్లమాని, ప్రగతి శ్రీవాత్సవ్ కథానాయికలు. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ ప్రమోషనల్ కంటెంట్ కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. జూన్ 23న సినిమా విడుదల కానున్న నేపథ్యంలో చిత్ర యూనిట్ గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. హీరో కార్తికేయ ఈ వేడుకలో ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. చిత్ర యూనిట్ తో పాటు హీరో రక్షిత్, డైరెక్టర్ అజయ్ భూపతి, కొండా విజయ్, శేఖర్ రెడ్డి తదితరులు ఈవెంట్ కు హాజరయ్యారు .
 
ప్రీ రిలీజ్ ఈవెంట్ లో హీరో కార్తికేయ మాట్లాడుతూ.. ఈవెంట్ లో అజయ్, శేఖర్ రెడ్డి, రాజ్ కందుకూరి గారిని చూస్తుంటే నాకు ఆర్ఎక్స్ 100 రీయూనియన్ లా అనిపించింది. రాజ్ కందుకూరి గారు ఆర్ఎక్స్ 100 ఈవెంట్ కి వచ్చి సపోర్ట్ చేయడం ఎప్పటికీ మర్చిపోలేను. ఆర్ఎక్స్ 100 తర్వాత రాజ్ గారికి ఇంకా దగ్గరయ్యాను. సినిమా చేయాలనే చర్చలు జరుగుతున్న సమయంలో శివ యూఎస్ నుంచి వచ్చారు. చూడటానికి చాలా అందంగా క్యూట్ గా ఉన్నారు. శివని హీరోగా లాంచ్ చేయొచ్చు కదా అన్నాను. మొదట్లో తను సాఫ్ట్ సినిమా చేశారు. ఇప్పుడు మను చరిత్ర ట్రైలర్ చూస్తుంటే టెన్షన్ మొదలైయింది. ఆర్ఎక్స్ 100 తర్వాత ఆ బ్లాక్ లో మనం ఉన్నాం కదా అనుకున్నా. ట్రైలర్ చూస్తుంటే కాంపిటీషన్ వచ్చిందనిపించింది.(నవ్వూతూ). ట్రైలర్ టీజర్ చాలా హార్డ్ హిట్టింగ్ గా వున్నాయి. ఆర్ఎక్స్ 100 విడుదలకు ముందు ఎలాంటి వైబ్స్ ఉండేవో ఇప్పుడు అలానే అనిపిస్తుంది. టీం అందరికీ ఆల్ ది బెస్ట్. సినిమా ఖచ్చితంగా పెద్ద విజయం సాధిస్తుంది’’ అన్నారు.
 
అజయ్ భూపతి మాట్లాడుతూ.. ఫెయిల్యూర్ ని సక్సెస్ చేసుకోవడం ఎలా అని ఆర్ఎక్స్ 100 తీసి సక్సెస్ అయ్యా. మను చరిత్రలో విజువల్ చూస్తుంటే దర్శకుడు భరత్ స్టొరీ ఏమో అనే డౌట్ గా వుంది(నవ్వుతూ). ఈ ప్రయత్నంలో తను కూడా విజయ్ సాధించబోతున్నాడు. ఈ సినిమా పెద్ద సక్సెస్ కావాలి. భరత్ చాలా కష్టపడ్డాడు. తనకోసమైనా ఈ సినిమా ఆడాలి. చాలా నిజాయితీగా తీశాడు. మ్యూజిక్, విజువల్స్ అన్నీ బాగున్నాయి. శివ చాలా అద్భుతంగా కనిపిస్తున్నాడు. టీం అందరికీ ఆల్ ది బెస్ట్'' తెలిపారు.