మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By selvi
Last Updated : సోమవారం, 21 మే 2018 (13:45 IST)

యూరప్‌లో రొమాన్స్ చేయనున్న కీర్తి సురేష్-చియాన్ విక్రమ్?

చియాన్ విక్రమ్ హీరోగా ''సామి'' సినిమా కోలీవుడ్‌లో బంపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు ప్రస్తుతం సీక్వెల్ వస్తోంది. విక్రమ్ హీరోగా హరి దర్శకత్వంలో 'సామి 2' సినిమా రూపొందుతోంది. పోలీస్ ఆఫీసర్ పా

చియాన్ విక్రమ్ హీరోగా ''సామి'' సినిమా కోలీవుడ్‌లో బంపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు ప్రస్తుతం సీక్వెల్ వస్తోంది. విక్రమ్ హీరోగా హరి దర్శకత్వంలో 'సామి 2' సినిమా రూపొందుతోంది.

పోలీస్ ఆఫీసర్ పాత్రలో విక్రమ్ కనిపించే ఈ సినిమా, భారీ యాక్షన్ ఎంటర్టైనర్‌గా తెరకెక్కుతోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కారైకుడిలో జరుగుతోంది. తదుపరి షెడ్యూల్ కోసం సామి-2 యూరప్‌కు వెళ్తోంది. 
 
యూరప్‌లో సామి-2 హీరోహీరోయిన్లు విక్రమ్, కీర్తి సురేష్‌లపై డ్యూయెట్ సాంగ్‌ను చిత్రీకరించనున్నారు. ఈ పాట సినిమాకు హైలైట్‌గా వుంటుందని.. సినీ యూనిట్ చెప్తోంది. విక్రమ్‌కి, కీర్తి సురేష్‌కి తెలుగులోనూ మంచి క్రేజ్ వుండటంతో.. తెలుగులోనూ ఈ సినిమాను విడుదల చేయనున్నారు. 
 
సామి స్క్వార్ పేరిట రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాలో బాబీ సింహా, జాన్ విజయ్, సూరి, ప్రభు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఇక రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం సమకూర్చారు. ఈ చిత్రాన్ని జూన్‌లో విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.