ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By శ్రీ
Last Modified: శుక్రవారం, 20 సెప్టెంబరు 2019 (23:06 IST)

సైరాకి స‌ల్మాన్ స‌పోర్ట్... ఇంత‌కీ ఏం చేసాడు?

మెగాస్టార్ చిరంజీవి నటించిన తాజా చిత్రం సైరా నరసింహా రెడ్డి. సురేంద‌ర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా రూపొందుతోన్న ఈ సంచ‌ల‌న చిత్రం గాంధీ జ‌యంతి సంద‌ర్భంగా అక్టోబర్ 2న ప్ర‌పంచ వ్యాప్తంగా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. టాలీవుడ్‌లోనే కాకుండా బాలీవుడ్‌లో సైతం భారీ స్థాయిలో రిలీజ్ కాబోతోంది. 
 
ఇటీవ‌ల ఒకేసారి అన్ని భాషల్లో రిలీజ్ చేసిన‌ ట్రైలర్ ట్రెమండ‌స్ రెస్పాన్స్ ల‌భిస్తుంది. ఇక బాలీవుడ్లో ఇప్పటికే అమితాబ్ బచ్చన్ పాత్ర ద్వారా మంచి క్రేజ్ నెలకొంది. ఇప్పుడు బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ కూడా సైరాకి మరింత బూస్ట్ ఇచ్చాడు. అవును... కండ‌లవీరుడు స‌ల్మాన్ ఖాన్ సైరాకి స‌పోర్ట్ చేస్తున్నాడు. చాలాకాలంగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌కు సల్మాన్ ఖాన్‌కు మధ్య మంచి సాన్నిహిత్యం ఉంది. 
 
ప్రేమ్ రతన్ ధన్ పాయో సినిమా తెలుగులో ప్రేమ లీలగా రిలీజయినప్పుడు చరణ్ సల్మాన్ వాయిస్‌కి డబ్బింగ్ చెప్పాడు. ఇప్పుడు రామ్ చరణ్ నిర్మించిన సైరా సినిమాకు సల్మాన్ తన బెస్ట్ విషెస్‌ని అందించారు. అలాగే మెగాస్టార్‌కి కూడా సినిమా మంచి విజయాన్ని అందించాలని సైరా హిందీ ట్రైలర్‌ను సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీంతో సైరా ట్రైలర్ బాలీవుడ్‌లో మరింత హాట్ టాపిక్‌గా మారింది. మ‌రి... సైరా బాక్సాఫీస్ వ‌ద్ద ఎలాంటి సెన్సేష‌న్ క్రియేట్ చేస్తుందో చూడాలి.