బాలీవుడ్ బాద్షా సల్మాన్ ఖాన్ దబాంగ్-3 ట్రైలర్ విడుదల
సల్మాన్ ఖాన్-ప్రభుదేవా కాంబినేషన్లో వచ్చిన దబాంగ్, దబాంగ్ 2 చిత్రాలు బాక్సఆఫీస్ వద్ద బిగ్గెస్ట్ హిట్ అయిన విషయం తెలిసిందే. ఆ సీరీస్‌లో భాగంగా ఇప్పుడు వారిద్దరి క్రేజీ కాంబినేషన్లో వస్తోన్న చిత్రం దబాంగ్-3. ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. పార్ట్ 1, పార్ట్ 2లో లేని సరికొత్త అంశాలతో ఈ చిత్రం రూపొందనుంది.
సోనాక్షి సిన్హా, సై మంజ్రేకర్ హీరోయిన్స్‌గా నటించారు. సల్మాన్ ఖాన్ ఫిలిమ్స్ సౌజన్యంతో శాఫ్రాన్ బ్రాడ్ కాస్ట్ అండ్ మీడియా లిమిటెడ్ సమర్పణలో ఆర్బాజ్ ఖాన్ నిర్మాణంలో సల్మాన్ ఖాన్, ఆర్బాజ్ ఖాన్, నిఖిల్ ద్వివేది దబాంగ్-3 చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇండియన్ మైకేల్ జాక్సన్ ప్రభుదేవా సరికొత్తగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.
హిందీ, తెలుగు, తమిళ్ భాషల్లో రూపొందిన ఈ చిత్రం డిసెంబర్ 20న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. కాగా ఈ చిత్రం ట్రయిలర్‌ని అక్టోబర్ 23న ముంబై, హైదరాబాద్, బెంగళూరు, చెన్నైలో అభిమానుల సమక్షంలో లైవ్ చాట్లో విడుదల చేశారు. అన్నిచోట్లా పీవీఆర్ థియేటర్స్‌లో దబాంగ్-3 ట్రైలర్ విడుదల కావడం విశేషం.