గురువారం, 20 ఫిబ్రవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By దేవి
Last Updated : సోమవారం, 17 ఫిబ్రవరి 2025 (18:23 IST)

సందీప్ కిషన్, రీతు వర్మ ల పై మజాకా లో రావులమ్మ సాంగ్ షూట్

Sandeep Kishan, Ritu Verma
Sandeep Kishan, Ritu Verma
సందీప్ కిషన్  30వ సినిమా ‘మజాకా’. ధమాకా మేకర్ త్రినాధరావు నక్కిన దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఎకె ఎంటర్టైన్మెంట్స్, హాస్య మూవీస్ బ్యానర్స్ పై రాజేష్ దండా నిర్మిస్తున్నారు. బాలాజీ గుత్తా సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. రీతు వర్మ హీరోయిన్. అన్షు, రావు రమేష్  కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ మూవీ శివరాత్రి కానుకగా ఫిబ్రవరి 26న థియేటర్లలో గ్రాండ్ గా విడుదల కానుంది.

ఈ సందర్భంగా మేకర్స్ క్రియేటివ్ ప్రమోషన్స్ తో ఆడియన్స్ ని అలరించారు. షూటింగ్ ని  లైవ్‌ ద్వారా ప్రేక్షకులకు చూపించారు. షూటింగ్ ని లైవ్ లో ఇవ్వడం ఇదే తొలిసారి. లైవ్ షూటింగ్ ద్వారా సినీ ప్రేక్షకులు సరికొత్త అనుభూతిని అందించారు మజాకా మేకర్స్.
 
ఈ సందర్భంగా సందీప్ కిషన్ మాట్లాడుతూ, ఇది ఫస్ట్ ఎవర్ లైవ్ షూట్ అని చెబుతుంటే నాకు చాలా సర్ ప్రైజ్ గా అనిపించింది. చాలా కొత్త ఎక్స్ పీరియన్స్ ఇది. వన్ మంత్ గా డే అండ్ నైట్ షూటింగ్ చేస్తున్నాం. ఫెబ్రవరి 26న పెద్ద హిట్ కొడుతున్నామనే నమ్మకం వుంది. మీ అందరి సపోర్ట్ కావాలి'అన్నారు.    
 
హీరోయిన్ రీతువర్మ మాట్లాడుతూ, మజాకాని థియేటర్స్ లో చూసి ఎంజాయ్ చేయాలని కోరుతున్నాను.  థాంక్ యూ 'అన్నారు  
 
దర్శకుడు త్రినాధరావు నక్కిన మాట్లాడుతూ..  మజాకాలో ఇది సెకండ్ మాస్ సాంగ్. మూడు రోజుల క్రితం భారీ సెట్ లో ఓ సాంగ్ చిత్రీకరించాం. సందీప్ కిషన్, రీతూ వర్మ ఇరగదీశారు. దాదాపు డెబ్బైమంది డ్యాన్సర్స్ తో భారీ సెట్స్ లో శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీలో సాంగ్ అద్భుతంగా షూట్ చేశాం. ఇప్పుడు కంప్లీట్ అవుట్ డోర్ లో చేస్తున్న రావులమ్మ ఇంకో మాస్ సాంగ్. ఫుల్ ఫోక్ సాంగ్. థియేటర్స్ లో దద్దరిల్లిపోతుంది. ఈసారి మళ్ళీ సీట్లు లేస్తాయి. ఇది ఫిక్స్. సినిమా రీరికార్డింగ్ చూసేశాను. ఎక్స్ లెంట్ గా వుంది. సందీప్ కిషన్ ఫ్యాన్స్ రెడీ అయిపోండి. మామూలుగా వుండదు 'అన్నారు.
 
నిర్మాత అనిల్ సుంకర మాట్లాడుతూ, గత 25 రోజులుగా డే అండ్ నైట్  కష్టపడ్డారు. ఎంతో ఉత్సాహంతో మమ్మల్ని సపోర్ట్ చేయడానికి వచ్చిన మీడియాకి ధన్యవాదాలు. మా సినిమాకి మీ సపోర్ట్ చాలా అవసరం. మా ప్రివియస్ మూవీకి చాలా సపోర్ట్ చేశారు. అన్ని ఎలిమెంట్స్ అద్భుతంగా కుదిరిన సినిమా మజాకా. ఈసారి మళ్ళీ బ్లాక్ బస్టర్ కొడుతున్నాం'అన్నారు.  
 
నిర్మాత రాజేష్ దండా మాట్లాడుతూ.. మీడియాకి థాంక్ యూ. న్యూ ఇయర్ నుంచి సంక్రాంతి దాక సినిమా కోసం టీం అంతా నాన్ స్టాప్ గా కష్టపడ్డారు. చాలా మంచి సినిమా తీశాం. మా బ్యానర్ లో బెస్ట్ సినిమా తీశామని నమ్ముతున్నాను. మా టీం అందరికీ పేరుపేరునా థాంక్ యూ' అన్నారు.