బుధవారం, 1 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : గురువారం, 19 సెప్టెంబరు 2019 (14:27 IST)

శివజ్యోతిని ఏడిపించిన బాబా భాస్కర్.. అలా ఇరుక్కుపోయిందా?

బిగ్ బాస్ మూడో సీజన్‌లో సూపర్ కంటిస్టెంట్‌గా పేరు తెచ్చుకున్న శివజ్యోతిని ఎమోషనల్‌గా వెనక్కి నెట్టేందుకు హౌజ్ మేట్స్ ప్రయత్నాలు చేస్తున్నట్టుంది. తొమ్మిదో వారంలోకి అడుగుపెట్టిన బిగ్‌బాస్‌ హౌస్‌ నామినేషన్‌ ప్రక్రియను పూర్తి చేసుకోగా రాహుల్‌, మహేశ్‌, హిమజలు ముగ్గురు ఎలిమినేషన్‌లో ఉన్నారు. 
 
ఇక బిగ్‌బాస్‌ ఇచ్చిన ఫన్నీటాస్క్‌ క్రేజీ కాలేజ్‌ టాస్క్‌లో ఇంటి సభ్యులందరూ ఇరగదీశారు. లవ్వాలజీ లెక్చరర్‌గా వ్యవహరించిన బాబా భాస్కర్‌ బాగానే కామెడీ పండించాడు. అదే సమయంలో శివజ్యోతిని ఏడిపించాడు కూడా. మొదట ఏడుపును పంటికిందే బిగపట్టినప్పటికీ చివరికి బోరున ఏడ్చేసింది. తను ఎంత స్ట్రాంగో అందరికీ తెలుసు అంటూనే బాబా... శివజ్యోతిని ఏడిపించాడు.
 
నిజంగా సీజన్‌ ప్రారంభం నుంచి చూసినట్టైతే శివజ్యోతి మొదట రోహిణి, అషూరెడ్డితో బాగానే దోస్తీ చేసింది. షోలో భాగంగా రోహిణి ఇంటిని వీడే సమయం వచ్చినప్పుడు శివజ్యోతి వెక్కివెక్కి ఏడ్చింది. రోహిణి వెళ్లిన తర్వాతి వారానికే అషూ బయటకు వెళ్లాల్సి రావటంతో తనను ఆపటం ఎవరితరం కాలేదు. బిగ్‌బాస్‌ ముగ్గురు స్నేహితులను విడగొట్టినప్పటికీ శివజ్యోతి మరో తోడు వెతుక్కుంది. 
 
అలీ రెజాను సొంత తమ్ముడిగా చూసుకుంటూ మురిసిపోయింది. అంతలోనే బిగ్‌బాస్‌ అనూహ్యంగా ఏడోవారంలోనే అలీని ఎలిమినేట్‌ చేశాడు. దీంతో శివజ్యోతి ఇప్పుడు రవితో క్లోజ్‌గా ఉంటోంది. నామినేషన్‌ టాస్క్‌లో కూడా రవి, మహేశ్‌లకు తప్ప ఇంకెవరి కోసం త్యాగం చేయను అని  తేల్చిచెప్పింది. ఇవన్నీ చూస్తుంటే ఆమె నిజంగానే రిలేషన్‌ షిప్స్‌లో ఇరుక్కుపోయిందని, సొంతంగా ఆట ఆడలేకపోతోందని విమర్శలు వినిపిస్తున్నాయి.