సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 12 ఆగస్టు 2023 (22:20 IST)

కట్టప్ప ఇంట్లో విషాదం: సత్యరాజ్ తల్లి నాదాంబాళ్ కన్నుమూత

sathyaraj
ప్రముఖ నటుడు బాహుబలి కట్టప్ప సత్యరాజ్ ఇంట్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. సత్యరాజ్ తల్లి నాదాంబాళ్ కళింగరాయర్ (94) వృద్ధాప్యం కారణంగా మరణించారు. నాదాంబాళ్ తన తల్లి మరణ వార్త తెలియగానే సత్యరాజ్ షూటింగ్ ఆపేసి కోయంబత్తూర్ చేరుకున్నారు.  
 
వయోభారం కారణంగా అనారోగ్యం పాలైన ఆమె శుక్రవారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు. తన తల్లి నాదాంబాళ్‌కి తాను నటించిన చిత్రాలు అంటే చాలా ఇష్టం అని గతంలో తెలిపారు. తాను నటించిన ప్రతి చిత్రాన్ని ఆమె చూస్తారట. నాదాంబాళ్‌కి సత్యరాజ్‌తో పాటు ఇద్దరు కుమార్తెలు కూడా ఉన్నారు. 
 
సత్యరాజ్ తల్లి మృతి పట్ల హీరో, తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ సోషల్ మీడియాలో సంతాపం వ్యక్తం చేశారు. ఇంకా పలువురు సినీ రాజకీయ ప్రముఖులు కూడా నాదాంబాళ్ మృతి పట్ల విచారం వ్యక్తం చేస్తున్నారు.