సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శుక్రవారం, 21 జులై 2023 (16:46 IST)

యూఎస్. కామిక్ కాన్ ఈవెంట్ లో పాప్ కార్న్ అఫ్ ది కల్కి 2898

Prabhas, Nag Ashwin, Kamal Haasan in popcorn meet
Prabhas, Nag Ashwin, Kamal Haasan in popcorn meet
కామిక్-కాన్ ఇంటర్నేషనల్: శాన్ డియాగో యునైటెడ్ స్టేట్స్‌లో అతిపెద్ద పాప్ కల్చర్ ఈవెంట్.  అక్కడ జులై 20న ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్యంలో రూపొందుతున్న చిత్రానికి కల్కి  2898 పేరు పెట్టిన విషయం తెలిసిందే. అక్కడ పాప్ కార్న్ అఫ్ స్క్రీన్ ప్లే ఇంటరాక్షన్ లో ప్రభాస్, కమల్ హాసన్, నాగ్ అశ్విన్ పాల్గొన్నారు. సినిమా గురించి పలు విషయాలు వెల్లడించారు. బ్రుస్ లీ అంటే తనకు ఇష్టం అని, ఆయన తాను వేసుకున్న ట్-షర్ట్ చూపించారు. 
 
ప్రతి ఇయర్ ఇక్కడ పలు చిత్రాల ప్రమోషన్లు జరుగుతుంటాయి. హాలీవుడ్ సినిమాలకు కేర్ ఆఫ్ అడ్రెస్స్ గా నిలుస్తుంది. తొలిసారి తెలుగు సినిమాకు అవకాశం రావడం విశేషం. కల్కి  2898 సినిమాలు వరల్డ్ వైడ్ గా విడుదల చేయనున్నారు. ఇక్కడకు ఎంతో మంది హాలీవుడ్ దర్శకులు, నటులు వస్తుంటారు. ఈ కల్కి లో రానా, కమల్ హాసన్ విలన్స్ గా నటించారని తెలుస్తోంది. వీటిపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.