సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 23 సెప్టెంబరు 2023 (12:05 IST)

నయనతార క్యారెక్టర్ చాలా అద్భుతం.. కానీ అదొక్కటే మిస్: షారూఖ్ ఖాన్

Shah Rukh Khan, Jawan
జవాన్ సినిమాలో నయనతార పాత్రకు సంబంధించి పెద్దగా హోప్ లేకపోవడంతో దర్శకుడు అట్లీపై నయనతార అసంతృప్తి వ్యక్తం చేసినట్లు వార్తలు వచ్చాయి. బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్, నయనతార జంటగా నటించిన 'జవాన్' మూవీ భారీ కలెక్షన్లు రాబడుతోంది. దాదాపు వెయ్యి కోట్ల క్లబ్‌కు జవాన్ చేరువలో వుంది. 
 
ఈ నేపథ్యంలో జవాన్‌లో తన క్యారెక్టర్‌ను తగ్గించి, దీపికా పదుకుణే క్యారెక్టర్‌ను హైలైట్ చేశారని అట్లీపై నయన్ కోపంగా వున్నట్లు టాక్. ఈ వార్తలు ప్రస్తుతం నెట్టింట వైరల్ కావడంతో.. ఎక్స్ (ట్విట్టర్) వేదికగా 'ఆస్క్ మీ ఎనీథింగ్' కార్యక్రమంలో షారూఖ్ ఖాన్ స్పందించారు. 
 
ఈ చిత్రంలో నయనతార పోషించిన సింగిల్ మదర్ క్యారెక్టర్ చాలా అద్భుతంగా ఉందని కితాబునిచ్చారు. అయితే నయనతారకు ఎక్కువ స్క్రీన్ స్పేస్ లేకపోయిందని అయినప్పటికీ ఆమె పాత్ర చాలా గొప్పగా ఉందని అన్నారు.
 
ఈ చిత్రంలో నయనతార పోషించిన సింగిల్ మదర్ క్యారెక్టర్ చాలా అద్భుతంగా ఉందని కితాబునిచ్చారు. అయితే నయనతారకు ఎక్కువ స్క్రీన్ స్పేస్ లేకపోయిందని అయినప్పటికీ ఆమె పాత్ర చాలా గొప్పగా ఉందని అన్నారు.