గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : బుధవారం, 28 ఆగస్టు 2019 (11:15 IST)

ఉదయ్ కిరణ్ అందుకే సూసైడ్ చేసుకున్నాడు.. జబర్దస్త్ వల్లే గౌరవం: షేకింగ్ శేషు

జబర్దస్త్ కమెడియన్ షేకింగ్ శేషు నటుడు ఉదయ్ కిరణ్‌ ఆత్మహత్యపై కామెంట్లు చేశాడు. సినిమాల్లో అవకాశాల కోసం తాను ఎంతగానో తిరిగానని, అవకాశం రాలేదని చచ్చిపోవాలని అనిపించిన క్షణాలున్నాయని చెప్పాడు. 
 
నటించడం కోసమే ఇండస్ట్రీకి వచ్చిన వాడికి మంచి డైరెక్టర్ సినిమాలో అవకాశం రాకపోతే ఏం చేయాలి.? సంసారాన్ని పోషించలేని వాడు ఆత్మహత్య చేసుకుంటున్నట్లే. సినిమాల్లో అవకాశాలు రాని వాళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. నటుడు ఉదయ్ కిరణ్ కూడా అవకాశాలు రాకపోవడం వల్లే ఆత్మహత్య చేసుకున్నాడని శేషు అన్నాడు. 
 
కానీ బుల్లితెరపై తనకు మంచి గుర్తింపు వచ్చిందని శేషు చెప్పాడు. జబర్దస్త్ సెట్‌లో అందరూ తనను డాడీ, బాబాయ్ అని పిలుస్తారని, తన వయసుకి గౌరవమిచ్చి మర్యాదపూర్వకంగా ఉంటారని చెప్పుకొచ్చాడు. 
 
కేవలం కళాకారులే కాదు.. జడ్జ్‌లు రోజా గారు, నాగబాబు గారు మిగిలిన వాళ్లందరూ తనతో మంచిగానే వుంటారని వెల్లడించాడు. కాగా సుప్రీమ్, రంగస్థలం చిత్రాల్లో నటించిన శేషుకు మంచి గుర్తింపు వచ్చిన సంగతి తెలిసిందే. రంగస్థలంలో శేషు వేసిన పాత్రకి విమర్శకుల నుండి ప్రశంసలు దక్కాయి.