శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 15 ఫిబ్రవరి 2022 (13:24 IST)

షణ్ముఖ్-దీప్తితో బ్రేకప్.. కారణం ఏంటంటే?

బిగ్‌బాస్ నుంచి బయటకి వచ్చాక సోషల్ మీడియా, యూట్యూబ్ స్టార్ షణ్ముఖ్ జస్వంత్ దీప్తితో బ్రేకప్ జరిగిన సంగతి తెలిసిందే. తాజాగా ఓ ఇంటర్వ్యూలో షణ్ముఖ్ మాట్లాడుతూ.. "నా పాయింట్‌ ఆఫ్‌ వ్యూలో బిగ్‌బాస్‌ లాంటి రియాల్టీ షోకి నేను సెట్‌ కాను. నేను చాలా మూడీగా ఉండే వ్యక్తిని. ఎదుటివారితో చాలా తక్కువగా కలుస్తుంటాను. ప్రేక్షకుల్లో గుర్తింపు తెచ్చుకోవడం కోసమే నేను బిగ్‌బాస్ రియాల్టీ షోలో పాల్గొన్నాను. ఆ షోలో ఉన్నప్పుడు నా గురించి ప్రేక్షకులు పాజిటివ్‌గానే ఆలోచిస్తున్నారనుకున్నాను. కానీ నాపై ఎంతటి నెగెటివిటీ వచ్చిందో హౌస్‌ నుంచి బయటకు వచ్చాకే తెలిసింది." అని తెలిపారు.
 
దీప్తితో బ్రేకప్ గురించి షన్ను మాట్లాడుతూ.. "హౌస్‌లో ఉన్నప్పుడు సిరితో చనువుగా ఉండటమే నెటిజన్లలో నాపై వ్యతిరేకత పెరగడానికి కారణం అనుకుంటున్నాను. అప్పటికే నేను దీప్తితో, సిరి శ్రీహాన్‌తో రిలేషన్‌లో ఉన్నాం. హౌస్‌లో ఉన్నప్పుడు మేమిద్దరం ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాం. దాంతో ఒకరికి ఒకరు తోడుగా, సపోర్ట్ గా ఉండే ప్రాసెస్ లో మా ఇద్దరి మధ్య కాస్త చనువు పెరిగింది. దాంతో అందరిలో వ్యతిరేకత మొదలైంది. దీప్తి నేనూ విడిపోవడానికి చాలా కారణాలున్నాయి. నా వల్ల దీప్తి ఎంతో నెగెటివిటీ చూసింది. నెటిజన్లు నన్ను ట్రోల్‌ చేస్తున్నప్పుడు తను నాకే సపోర్ట్‌ చేసింది.." అని చెప్పారు.