గురువారం, 26 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : శుక్రవారం, 9 జులై 2021 (12:27 IST)

శ‌ర్వానంద్‌, సిద్ధార్ద్ `మ‌హా స‌ముద్రం` షూటింగ్ పూర్తి

Sharwanand, Siddharth
ప్రామిసింగ్ యాక్ట‌ర్స్ శ‌ర్వానంద్‌, సిద్ధార్ధ్ న‌టిస్తున్న చిత్రం `మ‌హాస‌ముద్రం`. అజ‌య్ భూప‌తి ద‌ర్శ‌కుడు. ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ ఏకే ఎంట‌ర్‌టైన్ మెంట్స్ ఒక మాస్ట‌ర్‌పీస్‌గా రూపొందిస్తున్నారు.కేవ‌లం ఈ క్రేజీ కాంబినేష‌న్‌ని క్యాష్ చేసుకోవ‌డ‌మే కాదు ఒక ప‌ర్‌ఫెక్ట్ కమర్షియల్ చిత్రానికి అవసరమైన అన్ని అంశాల‌తో రెగ్యుల‌ర్ మాస్ ఎంట‌ర్ చిత్రాల‌కు భిన్నంగా ఒక డిఫ‌రెంట్ కంటెంట్‌తో ఈ మూవీ తెర‌కెక్కుతోంది.
 
ఇది క‌థా ర‌చ‌యిత‌, ద‌ర్శ‌కుడు అజ‌య్ భూప‌తికి  డ్రీమ్ ప్రాజెక్ట్. ప్ర‌తి క్యారెక్ట‌ర్‌కు ఎంతో ప్రామ‌ఖ్య‌త ఉండ‌బోతుంది. దానిలో భాగంగానే ఇప్ప‌టికే విడుద‌ల‌చేసిన శ‌ర్వానంద్‌, సిద్దార్ధ్‌, అధితిరావు హైద‌రి, అనూ ఇమాన్యూయేల్, జ‌గ‌ప‌తిబాబు, రావు ర‌మేష్, గ‌రుడ రామ్‌ ఫ‌స్ట్‌లుక్స్‌కి  అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌నుండి మంచి రెస్పాన్స్ వ‌చ్చింది.
 
మేక‌ర్స్ ఇప్ప‌టివ‌ర‌కు కేవ‌లం ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్స్ కాకుండా ఏ ఇత‌ర ప్ర‌మోష‌న‌ల్ కంటెంట్‌ని రిలీజ్ చేయ‌న‌ప్ప‌టికీ ఈ సినిమాపై భారీ అంఛనాలు ఏర్ప‌డ్డాయి.గత కొన్ని రోజులుగా ప్రధాన తారాగణంపై ముఖ్యమైన సన్నివేశాలను తెర‌కెక్కించారు మేక‌ర్స్ దీంతో `మ‌హా స‌ముద్రం`మూవీ షూటింగ్ పూర్త‌య్యింది.
 
షూట్ ఎంత ఆనందంగా గ‌డిచిందో అనే దానికి ప్రతీకగా విశాఖపట్నం నేపథ్యంలో శర్వానంద్ మరియు సిద్ధార్థ్ న‌వ్వుతూ ఉన్న పోస్ట‌ర్‌ని రిలీజ్ చేశారు మేక‌ర్స్‌. ఇద్ద‌రు పిడికిలి బిగించి న‌వ్వుతూ ఉన్నఈ పోస్ట‌ర్ ఆక‌ట్టుకుంటోంది.
 
థియేట్రిక‌ల్ రిలీజ్‌కోసం సిద్ద‌మ‌వుతున్న `మ‌హాస‌ముద్రం` ప్ర‌మోష‌న్స్ అతి త్వ‌ర‌లో ప్రారంభం కానున్నాయి. ఇంటెన్స్ ల‌వ్ అండ్ యాక్ష‌న్ డ్రామాగా రూపొందుతోన్నఈ చిత్రాన్ని ఏకే ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ప‌తాకంపై సుంక‌ర రామ‌బ్ర‌హ్మం నిర్మిస్తున్నారు. అదితిరావు హైద‌రి, అనూ ఇమాన్యూల్ ఫీమేల్ లీడ్ రోల్స్‌లో న‌టిస్తున్నారు.
 
చేత‌న్ భ‌ర‌ద్వాజ్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి రాజ్‌తోట సినిమాటోగ్రాఫ‌ర్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. కేఎల్ ప్ర‌వీణ్ ఎడిట‌ర్‌, కొల్ల అవినాష్ ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్‌గా వ‌ర్క్ చేస్తున్నారు.
 
‌ర‌చ‌న, ద‌ర్శ‌క‌త్వం: అజ‌య్ భూప‌తి, నిర్మాత‌: సుంక‌ర రామ‌బ్ర‌హ్మం, కో- ప్రొడ్యూస‌ర్‌: అజ‌య్ సుంక‌ర‌,  ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్: కిషోర్ గ‌రికిపాటి, సంగీతం: చైత‌న్ భ‌ర‌ద్వాజ్,  సినిమాటోగ్ర‌ఫి: రాజ్‌తోట,  ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్‌: అవినాష్ కొల్లా,  ఎడిట‌ర్‌: ప్ర‌వీణ్ కేఎల్‌.