ఆదివారం, 26 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ivr
Last Modified: శనివారం, 21 జులై 2018 (15:57 IST)

కాజల్‌కు ఇప్పటివరకూ అలాంటి ఎక్స్‌పీరియెన్స్ ఎదురుకాలేదట... మరి శ్రీరెడ్డి ఏమంటుందో?(Video)

క్యాస్టింగ్ కౌచ్ అంటూ టాలీవుడ్ నుంచి ప్రస్తుతం కోలీవుడ్ ఇండస్ట్రీలో గడబిడ సృష్టిస్తున్న తార శ్రీరెడ్డి. ఇప్పుడు ఏ తార ఎక్కడ ప్రెస్ మీట్ పెట్టినా విలేకరులు నటీమణులకు క్యాస్టింగ్ కౌచ్ గురించి ప్రశ్నలు సంధిస్తున్నారు. ఇప్పటికే దీనిపై అనేకమంది సమాధానాలు

క్యాస్టింగ్ కౌచ్ అంటూ టాలీవుడ్ నుంచి ప్రస్తుతం కోలీవుడ్ ఇండస్ట్రీలో గడబిడ సృష్టిస్తున్న తార శ్రీరెడ్డి. ఇప్పుడు ఏ తార ఎక్కడ ప్రెస్ మీట్ పెట్టినా విలేకరులు నటీమణులకు క్యాస్టింగ్ కౌచ్ గురించి ప్రశ్నలు సంధిస్తున్నారు. ఇప్పటికే దీనిపై అనేకమంది సమాధానాలు చెప్పారనుకోండి. తాజాగా టాలీవుడ్ బ్యూటీ కాజల్ అగర్వాల్‌కు కూడా ఇదే ప్రశ్న ఎదురైంది. దీనిపై సమాధానం చెప్పిన కాజల్ అగర్వాల్ తనకు ఇప్పటివరకూ అలాంటి అనుభవం ఎదురుకాలేదని తేల్చి చెప్పింది.
 
కానీ శ్రీరెడ్డి మాత్రం టాలీవుడ్, కోలీవుడ్ టాప్ హీరోయిన్లను కదిలిస్తే పెద్ద జాబితా దొరుకుతుందని అంటోంది. మరి టాప్ హీరోయిన్లకు అలాంటి అనుభవాలు ఎదురుకాలేదని చెపుతున్నారు. శ్రీరెడ్డి వంటి చిన్నతారలకే ఇలాంటి అనుభవాలు ఎదురవుతాయోమో అని అనుకోవాలా? చూడండి కాజల్ అగర్వాల్ ఏం చెప్పారో ఈ వీడియోలో...