శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 10 డిశెంబరు 2021 (16:11 IST)

హైదరాబాద్ సిటీలో శ్రియ ఆటో జర్నీ.. ఎందుకో తెలుసా?

టాలీవుడ్ హీరోయిన్ శ్రీయ హైదరాబాద్ నగరంలో ఆటోలో ప్రయాణం చేశారు. తాజాగా ఆమె ప్రధాన పాత్ర పోషించిన చిత్రం "గమనం". ఈ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాను చూసేందుకు శ్రియ నగరంలోని మల్లిఖార్జున థియేటర్‌కు వచ్చారు. 
 
ఇందుకోసం కూకట్‌పల్లిలో ఉన్న ఈ థియేటర్‌ వరకు ఆమె ఓ ఆటోలో వచ్చి అందర్నీ ఆశ్చర్యపరిచారు. థియేటర్ వద్ద ఆటోలో నుంచి శ్రియ దిగగానే ఒక్కసారిగా సందడి వాతావరణం నెలకొంది. 
 
కాగా, ఈ చిత్రానికి సుజనా రావు దర్శకత్వం వహించగా, ఇందులో శ్రియతో పాటు ప్రియాంక జువాల్కర్, నిత్యా మీనన్, సుహాస్ రవి ప్రకాష్, శివ కందుకూరి తదితరులు నటించారు. ఇళయరాజా సంగీతం సమకూర్చారు. కలి ప్రొడక్షన్, క్రియా ఫిల్మ్ కార్ప్‌ బ్యానర్లపై నిర్మితమైంది.