శనివారం, 4 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : ఆదివారం, 3 డిశెంబరు 2023 (20:42 IST)

సింగర్ కౌసల్య పేరు, ఫోన్ నెంబర్, డీపీ వుంటే నమ్మొద్దు..

Kowsalya
సోషల్ మీడియాలో ఓ పోస్ట్‌ను షేర్ చేసింది సింగర్ కౌసల్య. అందులో ఈ విధంగా రాసుకొచ్చారు. "సోషల్ మీడియాలో కొంతమంది నా పేరు, నెంబర్ అంటూ మోసాలకు పాల్పడుతున్నారు. అది నా నంబర్ కాదు.. నా అకౌంట్ కాదు. ఎవరో నా ఫొటో డీపీ పెట్టుకుని, చాట్ చేస్తున్నారు. ఇలాంటి మోసాల పట్ల జాగ్రత్తగా ఉండండి.." అని తన ఫాలోవర్లకు సూచించింది. 
 
తన ఫాలోవర్లు ఇలాంటి వారితో చాటింగ్‌లు కానీ, డబ్బులు పంపడం కానీ చేయెద్దని పేర్కొంది. కాగా దివంగత మ్యూజిక్ డైరెక్టర్ చక్రి సారథ్యంలో వచ్చిన ఎన్నో చిత్రాల్లో కౌసల్య తన మార్క్ చూపించారు.