శుక్రవారం, 22 నవంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శనివారం, 2 డిశెంబరు 2023 (19:05 IST)

మంచి సినిమాను తీశామని అంటున్నారు : అథర్వ యూనిట్

Adharva team
Adharva team
క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ జానర్ సినిమాలో క్లూస్ టీం ప్రాధాన్యతను చూపిస్తూ తెరకెక్కించిన చిత్రం అథర్వ. కార్తీక్ రాజు, సిమ్రన్ చౌదరి, ఐరాలు హీరో హీరోయిన్లుగా నటించిన ఈ మూవీని మహేష్ రెడ్డి తెరకెక్కించారు. ఈ మూవీని నూతలపాటి నరసింహం, అనసూయమ్మ సమర్పణలో పెగ్గో ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సుభాష్ నూతలపాటి నిర్మించారు. ఈ చిత్రం డిసెంబర్ 1న ప్రేక్షకుల ముందుకు వచ్చి ప్రశంసలను అందుకుంది. ఈ మూవీ సక్సెస్ మీట్‌‌ను శనివారం నిర్వహించారు.
 
హీరో కార్తీక్ రాజు మాట్లాడుతూ..* ‘అథర్వ చిత్రానికి ఫుల్ పాజిటివ్ రిపోర్టులు వచ్చాయి. చాలా చోట్ల హౌజ్ ఫుల్స్ కనిపించాయి. మొదటి రోజే ఇంత మంచి ఆదరణ రావడంతో మేం పడ్డ కష్టాన్ని మర్చిపోయాం. ఏ ఒక్కరూ కూడా చెడ్డ సినిమా అని చెప్పడం లేదు. మంచి సినిమాను తీశామని అంటున్నారు. అక్కడే మా దర్శకుడు మహేష్ రెడ్డి సక్సెస్ అయ్యారు. మా సినిమాను ఇంతలా ఆదరిస్తున్న ప్రేక్షకులకు థాంక్స్’ అని అన్నారు.
 
 నిర్మాత సుభాష్ నూతలపాటి మాట్లాడుతూ..* ‘సినిమాకు ఇంత మంచి రెస్పాన్స్ వస్తుందని అనుకోలేదు. ఆడియెన్స్ మా చిత్రాన్ని ఆదరిస్తున్నారు. ఇంత పెద్ద విజయాన్ని అందించిన ప్రేక్షకులకు థాంక్స్’ అని అన్నారు.
 
 దర్శకుడు మహేష్ రెడ్డి మాట్లాడుతూ..* ‘మా సినిమాను ఇంత బాగా సపోర్ట్ చేస్తున్న మీడియా, ఆడియెన్స్‌‌కు థాంక్స్. సినిమాల మీద ప్యాషన్‌తో యూకే నుంచి వచ్చాను. ఈ రోజు దర్శకుడిగా తెరపై నా పేరు చూసుకుంటుంటే ఎంతో ఆనందంగా, సంతోషంగా అనిపిస్తుంది. ఓ సినిమాను తీయడం, రిలీజ్ చేయడం, జనాల వరకు తీసుకెళ్లడం, ఆడియెన్స్ ప్రేమను దక్కించుకోవడం మామూలు విషయం కాదు. ఇదంతా టీం సమష్టి కృష్టి వల్లే జరిగింది. కొత్త పాయింట్, కొత్త కథ చెబితే ఆడియెన్స్ ఆదరిస్తారని నాకు నమ్మకం ఉంది. అందుకే క్లూస్ టీం మీద సినిమాను తీశాను. కార్తీక్ రాజు అద్భుతంగా నటించారు. సిమ్రన్ చౌదరి చాలా బాగా నటించారని ఆడియెన్స్ అంటున్నారు. సారా పాత్రకు మంచి రెస్పాన్స్ వచ్చింది. విజయ రామరాజు తన కటౌట్‌కి తగ్గట్టుగా నటించాడు. గగన్ విహారికి ఒక్క డైలాగ్ కూడా పెట్టలేదు. చాలా కష్టపడి నటించారు. అందరూ అద్భుతంగా నటించారు. శ్రీ చరణ్ పాకాల అందించిన ఆర్ఆర్, పాటలు సినిమాకు ప్రాణంలా నిలిచింది. సాయి చరణ్ విజువల్స్ అందరినీ ఆకట్టుకున్నాయి. టీంలోని ప్రతీ ఒక్కరూ ఈ సినిమాకు ఎంతో కష్టపడ్డారు. ఇంత మంచి విజయాన్ని అందించిన ప్రేక్షకులకు థాంక్స్’ అని అన్నారు.
 
 సిమ్రన్ చౌదరి మాట్లాడుతూ..* ‘అథర్వ చిత్రంలో జర్నలిస్ట్ పాత్రను పోషించాను. థియేటర్లలో ఆడియెన్స్ రెస్పాన్స్ చాలా బాగుంది. ఇలాంటి గ్రిప్పింగ్ సినిమాను చాలా రోజుల తరువాత చూశామని, రెండో పార్ట్ ఎప్పుడు వస్తుందని అడుగుతున్నారు. ఇలాంటి కొత్త జానర్‌లో సినిమా చేయడం ఆనందంగా ఉంది. ఇంత మంచి అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు థాంక్స్’ అని అన్నారు.
 
 కల్పికా గణేష్ మాట్లాడుతూ..* ‘ఇంత మంచి పాత్ర నాకు దొరుకుతుందని అనుకోలేదు. ఇలాంటి మంచి అవకాశాన్ని ఇచ్చిన దర్శక నిర్మాతలకు థాంక్స్. సారా పాత్రకు మంచి రెస్పాన్స్ వస్తుండటం ఎంతో సంతోషంగా ఉంది’ అని అన్నారు.