1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated: శుక్రవారం, 26 మే 2023 (14:07 IST)

టీనేజ్‌లోనే రికార్డు సృష్టించిన సితార.. సూపర్ డీల్

Sitara
Sitara
టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు, నమ్రత శిరోద్కర్ దంపతుల కుమార్తె సితార చిన్న వయస్సులోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకుంది. టీనేజ్‌లోనే రికార్డు సృష్టించింది. డ్యాన్స్ వీడియోలతో, సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా వుండే సితార.. ప్రముఖ జ్యుయల్లరీ బ్రాండ్‌కు అంబాసిడర్‌గా మారిపోయింది. 
 
పీఎంజే జ్యుయలరీ సితారను తన ప్రచారకర్తగా నియమించుకుంది. ఇందు కోసం ఆమెకు పెద్ద మొత్తంలోనే చెల్లించనున్నట్టు సమాచారం. ఈ యాడ్ కోసం మూడు రోజుల పాటు షూటింగ్ జరిగింది. ఈ డీల్ ద్వారా చిన్న వయస్సులోనే తండ్రికి తగిన తనయ అని సితార నిరూపించుకుంది.