బుధవారం, 22 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 21 అక్టోబరు 2024 (16:05 IST)

విశాఖపట్నంలో పెళ్లి పనులు మొదలుపెట్టిన శోభిత.. పసుపు పండుగలో మెరిసింది.. (ఫోటోలు)

Sobhita Dhulipala
Sobhita Dhulipala
నటి శోభితా ధూళిపాళ, తెలుగు స్టార్ హీరో నాగ చైతన్య పెళ్లి వేడుకలు ఘనంగా ప్రారంభమైనాయి. త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్న ఈ జంటకు సంబంధించిన ఫోటోలు ఇప్పటికే నెట్టింట డ్రెండ్ అవుతున్నాయి. 
 
ఈ నేపథ్యంలో తెలుగు సంస్కృతిలో భాగంగా వివాహ ఉత్సవాల ప్రారంభాన్ని సూచించే పసుపు దంచడం వేడుకలో శోభితా పాల్గొన్న ఫోటోలు నెట్టింట వైరల్ అయ్యాయి. ఈ మేరకు సోషల్ మీడియాలో శోభితా ఈ ఫోటోలను పంచుకున్నారు. ఇంకా పెళ్లి వేడుకలు ప్రారంభం అంటూ హింట్ ఇచ్చారు. 
Sobhita Dhulipala
Sobhita Dhulipala
 
ఈ సందర్భంగా, శోభిత బంగారు జాకెట్టు, పగడపు, ఆకుపచ్చ రంగు సిల్క్ చీరను ధరించారు. ఇరువైపులా విభిన్న రంగులతో కూడిన బార్డర్ కలిగిన చీరలో శోభిత మెరిసిపోయారు. 
Sobhita Dhulipala
Sobhita Dhulipala
 
వివాహానికి ముందు జరిగే వేడుకల కోసం బంగారు ఆభరణాలు, ఆకుపచ్చ గాజులతో చూడముచ్చటగా కనిపించింది. ఈ పసుపు దంచుడు కార్యక్రమంలో శోభిత కుటుంబ సభ్యులు  పాల్గొన్నారు. ఈ ఏడాది ఆగస్టులో హైదరాబాద్‌లో శోభిత, నాగ చైతన్య నిశ్చితార్థం జరిగింది.