సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: బుధవారం, 9 అక్టోబరు 2024 (22:38 IST)

స్టాట్యూ ఆఫ్ యూనిటి నుండి మాటర్ మిషన్ ‘ఏరథాన్ భారత్’ ప్రారంభం

image
భారతదేశపు ప్రముఖ ఎలెక్ట్రిక్ మొబిలిటి కంపెనీ, మాటర్ గ్రూప్, ఈరోజు స్టాట్యూ ఆఫ్ యూనిటి నుండి తన మిషన్ ఏరథాన్ భారత్‌ను అధికారికంగా ప్రారంభించింది. ఏరథాన్ భారత్ అనేది వినూత్నమైన, సుస్థిరమైన మొబిలిటి పరిష్కారాలపై అవగాహనను ప్రోత్సహిస్తూ భారతదేశ ప్రజలను ఒకే ప్లాట్ఫార్మ్ పైకి తీసుకొచ్చేందుకు చేయబడుతున్న ఒక ప్రయత్నము. విభిన్నమైన మన దేశ భూభాగాల వెంబడి అభివృద్ధి చెందుతున్న ఈ పరిష్కారాలు బహుముఖంగా, విశ్వసనీయంగా ఉండేందుకు రూపొందించబడ్డాయి.
 
ఈ ప్రతిష్ఠాత్మకమైన ప్రయాణము యొక్క ప్రారంభ స్థానము, సర్దార్ వల్లభభాయ్ పటేల్‌కు ఒక నివాళిగా, భారతదేశపు శక్తి, ఐక్యత మరియు ముందుచూపుకు ప్రతీకగా నిలుస్తుంది. ఇది సుస్థ్రిఅమైన, పర్యావరణానుకూల రవాణా వైపుకు తన మార్పుతో భారతదేశాన్ని ఒక్కటిగా చేయాలనే మాటర్ యొక్క మిషన్‌ను ప్రతిబింబిస్తుంది. స్టాట్యూ ఆఫ్ యూనిట్ యొక్క అద్భుతమైన నేపథ్యములో, ఏరథాన్ భారత్ ఎలెక్ట్రిక్ వాహనాల ప్రపంచములో ఒక పరివర్తనాత్మక కదలికల కొరకు ఒక టోన్ సెట్ చేస్తుంది.
 
“మాటర్‌లో మేము శిలాజ ఇంధనాల నుండి సుస్థిరమైన ఎనర్జీ, మొబిలిటి ఎంపికల వైపుకు పరివర్తన కొరకు ఒక ఉత్ప్రేరకముగా ఉండాలనేది మా ధ్యేయము. గ్రహాన్ని పరిరక్షిస్తూ అలుపెరగని ఎలెక్ట్రిక్ మోటార్ బైక్స్ అందిస్తూనే జీవితాలను సుసంపన్నం చేసే రవాణాను అందించడం మా మిషన్. రోజువారి ప్రయాణానికైనా లేదా కొత్త ప్రాంతాలకు సాహస ప్రయాణాలకైనా, ప్రతి రైడ్ ఒక స్వేచ్చాయుతమైన భావనను కలిగించాలి, భవిష్యత్తు గురించిన అపరాధ భావనను కాదు,” అని మాటర్ వ్యవస్థాపకులు మాటర్ బృందముతో కలిసి పేర్కొన్నారు, మరియు పర్యావరణ నిర్వాహకత్వము పట్ల కంపెనీ యొక్క తిరుగులేని నిబద్ధతను పునరుద్ఘాటించారు.
 
ఏరథాన్ భారత్ అనేది ఎలాంటి ఉద్గారాలు లేని పరిస్థితిని సాధించడం కోసం మాటర్ యొక్క ప్రతిష్ఠాత్మక మిషన్. తీరప్రాంత ప్రదేశాల, పర్వత ప్రాంతాల నుండి సందడిగా ఉండే నగరాలు, ప్రశాంతమైన గ్రామాల వరకు భారతదేశపు వైవిధ్యభరితమైన ప్రదేశాలలో ప్రయాణిస్తూ ఈ అసాధారణ ప్రయాణము 25 రాష్ట్రాలలో 25,000 కిలోమీటర్లను కవర్ చేస్తుంది. గుజరాత్‌లో ప్రారంభమైన ఈ ప్రయాణము భారతదేశపు గొప్ప వారసత్వము, సహజమైన అందాలను ఆస్వాదిస్తూ అనేక సాంస్కృతిక, పర్యావరణ ల్యాండ్‎మార్క్స్ వద్ద మజిలీ తీసుకుంటుంది. సుస్థిరమైన మొబిలిటిని ప్రోత్సహించుటకు ఒక ప్లాట్ఫార్మ్‌గా పనిచేస్తూ, స్థానిక కమ్యూనిటీలలో నిమగ్నమై, మనం ఎదుర్కొనే పర్యావరణ సవాళ్ళ గురించి అవగాహన పెంచుతూ, ఈ రైడ్ ఎలెక్ట్రిక్ మోటార్ బైక్స్ అందించే బహుముఖ, కొత్త అనుభవాలను ప్రదర్శిస్తుంది. సుస్థిరమైన ఎంపికలను సమర్థించడం ద్వారా, “ఇన్నొవేట్ ఇన్ ఇండియా”, “మేక్ ఇన్ ఇండియా” కార్యక్రమాలకు మద్ధతునిస్తూ, మాటర్ ప్రజలు, గ్రహము యొక్క మెరుగుదల కొరకు శుభ్రమైన రవాణాలను అవలంబించాలని వ్యక్తులకు మరియు కమ్యూనిటీలకు  ప్రేరణ కలిగించాలని ఆశిస్తోంది.
 
వాతావరణ మార్పును ఎదుర్కొనుటకు, సుస్థిరమైన ఎంపికల అమలును వేగవంతం చేయుటకు ఉన్న అత్యవసర అవసరము ఏరథాన్ భారత్ మిషన్ యొక్క మూలం. ఈ ప్రయాణము ద్వారా గ్రామీణ మరియు సుదూర ప్రదేశాలలో ఎకోసిస్టమ్స్‌లో మార్పులు, పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, జీవవైవిధ్య నష్టము వంటి వాతావరణ మార్పు యొక్క ప్రత్యక్ష ప్రభావాలను ప్రాధాన్యీకరించడం మాటర్ లక్ష్యము. అర్ధవంతమైన సంభాషణను పెంచుతూ వారితో కలిసిపోతూ సుస్థిరమైన ఆచరణలకు అంకితమైన స్థానిక చేంజ్‎మేకర్స్, సంస్థలను ఈ రైడ్ సమర్థిస్తుంది. ఈ ప్రయాణ మార్గములో ప్రతి మజిలీలో కమ్యూనిటీ ఇంటరాక్షన్స్ ఉంటాయి, వీటిల్లో మాటర్ ఎలెక్ట్రిక్ వాహనాలను వినియోగించడం, కర్బన ఉద్గారాలను తగ్గించడం, రెనివబుల్ ఎనర్జీని వినియోగించడము, ట్రాఫిక్ నియమాలను అనుసరించి సురక్షితంగా ప్రయాణించడం వంటి పర్యావరణానుకూల కార్యక్రమాల గురించి తెలియజేస్తుంది.