శుక్రవారం, 10 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ప్రీతి చిచ్చిలి
Last Updated : మంగళవారం, 16 ఏప్రియల్ 2019 (16:17 IST)

పొడుగ్గా, సన్నగా, నల్లగా ఉన్నానని ఎగతాళి చేసేవారు.. బాలీవుడ్ బ్యూటీ

సల్మాన్‌ ఖాన్‌ సోదరుడు అర్బాజ్‌ ఖాన్‌ వ్యాఖ్యాతగా ‘పించ్‌’ అనే కార్యక్రమాన్ని హోస్ట్ చేస్తున్నారు. ప్రతివారం బాలీవుడ్ సెలబ్రిటీలను పిలిచి, వారిని ఇంటర్వ్యూ చేయడం ఈ షోలో జరుగుతోంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సోనమ్‌ కపూర్‌ ఒకప్పుడు బాడీ షేపింగ్ విషయంలో తాను ఎదుర్కొన్న అనుభవాల గురించి చెప్పుకొచ్చారు. ‘ఒకప్పుడు నేను పొడుగ్గా, సన్నగా, నల్లగా ఉన్నానని చాలా మంది నన్ను ఎగతాళి చేసేవారు. 
 
ఇలా ఉంటే నిన్నెవరు పెళ్లి చేసుకుంటారు? అంటూ వేలెత్తి చూపేవారు. ఇలా అన్నందుకు వారిపై నాకు కోపంగా ఏమీ లేదు. ఎందుకంటే నన్ను ద్వేషించేవారిని నేను నా శ్రేయోభిలాషులుగా భావించాను. అందుకే వారి మాటలను సవాలుగా తీసుకుని ఫిట్‌నెస్‌పై జాగ్రత్తలు తీసుకుని నేనేంటో నిరూపించుకున్నాను. చివరికి పెళ్లెవరు చేసుకుంటారనే స్థాయి నుండి ప్రేమించిన వ్యక్తినే భర్తగా పొందాను. ఇంతకంటే ఇంకేముంటుంది నిరూపించుకోవడానికి?’ అని వెల్లడించారు సోనమ్‌.
 
ప్రస్తుతం అభిషేక్‌ శర్మ దర్శకత్వం వహిస్తున్న ‘జోయా ఫ్యాక్టర్‌’ అనే సినిమాలో దుల్కర్‌ సల్మాన్‌‌కు జోడీగా సోనమ్ నటిస్తున్నారు. 2010 ప్రపంచకప్‌ సమయంలో చోటుచేసుకున్న సంఘటన ఆధారంగా ఈ సినిమా ఉండబోతున్న ఈ సినిమా జూన్‌ 14న విడుదల కానుంది.