బుధవారం, 26 మార్చి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By దేవీ
Last Updated : మంగళవారం, 25 మార్చి 2025 (16:20 IST)

Sonu Sood : సోనూ సూద్ భార్యకు తృటిలో తప్పిన ప్రమాదం

Sonu Sood,  Sonali
Sonu Sood, Sonali
సోనూ సూద్ భార్య సోనాలి సూద్ భారీ ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నారు. నాగపూర్ హైవేపై ప్రయాణిస్తున్న సోనాలి సూద్ కారును అదుపుతప్పిన లారీ ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. వెంటనే అప్రమత్తమైన కారు డ్రైవర్ చాకచక్యంగా కారును అదుపు చేశారు. దాంతో పెను ప్రమాదం నుంచి సోనాలిసోద్ తప్పించుకున్నారు.
 
 ఐతే ఈ ప్రమాదంలో చిన్నచిన్న గాయాలు కావడంతో.. సోనాలి సూద్ ప్రస్తుతం ముంబైలోని ఓ ప్రముఖ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ సందర్భంగా సోనూ సూద్ అభిమానులు ఆందోళనకు గురికావద్దని ఆయన టీం మీడియాకు తెలిపారు.