బుధవారం, 4 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 15 డిశెంబరు 2022 (18:38 IST)

ఫుట్‌బోర్డు ప్రయాణం సినిమాల్లో ఎంటర్‌టైన్మెంట్‌.. నిజ జీవితంలో కాదు..

sonu sood
బాలీవుడ్ నటుడు సోనూ సూద్ ఒక రైల్లో ఫుట్‌బోర్డులో కూర్చొని ప్రయాణం చేస్తున్న వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీనిపై నెటిజన్లు పలువురు పలు విధాలుగా కామెంట్ చేస్తున్నారు. ఈ వీడియోపై మహారాష్ట్ర పోలీసులు కూడా స్పందించారు. 'సోనూ సూద్ ఫుట్ బోర్డులో కూర్చొని ప్రయాణించడం సినిమాల్లో అయితే ఎంటర్‌టైన్మెంట్‌గా ఉంటుంది. నిజ జీవితంలో కాదు' అంటూ వ్యాఖ్యానించారు. 
 
కాగా, వేగంగా వెళుతున్న ఒక రైలు ప్రవేశద్వారంలో సోనూ సూద్ కూర్చొని ప్రయాణం చేస్తున్నారు. ఈ వీడియోపై కొందరు నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. ఇలాంటి వీడియోలు ప్రమోట్ చేయడం సరికాదని హితవు పలుకుతున్నారు. కరోనా కష్టకాలంలో ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచిన మీరు ఇలా చేయొద్దంటూ కోరారు.