సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శనివారం, 17 ఆగస్టు 2024 (14:04 IST)

ఆర్కే సాగర్ ది 100 మూవీ నుంచి స్పెషల్ పోస్టర్‌

100 movie poster
100 movie poster
బుల్లితెరపై స్టార్డంను చూసిన ఆర్కే సాగర్.. వెండితెరపై తన సత్తాను చాటేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆర్కే సాగర్ విభిన్న కథా చిత్రాలను చేస్తూ ఆడియెన్స్ ముందుకు వస్తున్నారు. మాస్ యాక్షన్ లవ్ స్టోరీలతో ప్రేక్షకుల్ని మెప్పించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం ఆయన వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు.  ఆగస్ట్ 16న పుట్టినరోజున ‘ది 100’ మూవీ నుంచి స్పెషల్ పోస్టర్‌ను విడుదల చేశారు.
 
ది 100 చిత్రాన్ని క్రియా ఫిల్మ్ కార్ప్, ధర్మ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు అంతర్జాతీయంగా ఎన్నో విశిష్టమైన అవార్డులు లభించాయి. ఇలాంటి ఈ చిత్రం నుంచి ఆర్కే సాగర్ బర్త్ డే సందర్భంగా స్పెషల్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఇందులో ఆర్కే సాగర్ ఎంతో పవర్ ఫుల్ లుక్‌లో కనిపిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా ఆడియెన్స్ ముందుకు రానుంది. ఆర్కే సాగర్ ప్రస్తుతం మంచి లైనప్‌తో ఉన్నారు. ఆల్రెడీ రెండు ప్రాజెక్టులు సెట్స్ మీద ఉన్నాయి. మరో క్రేజీ ప్రాజెక్టును పెద్ద బ్యానర్‌లో ప్రారంభించబోతోన్నారు.