సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : శుక్రవారం, 12 మార్చి 2021 (20:22 IST)

`గ‌ని` కోసం ప్ర‌త్యేక సెట్, రిలీజ్ వాయిదా!‌

Gani
వరుణ్ తేజ్ ‘గని’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. వరుణ్ తేజ్ 10 వ సినిమాగా తెరకెక్కుతుంది. అందుకే ఈ యాక్షన్ డ్రామాను ఆయ‌న ఎంచుకున్నారు. ఈ చిత్ర క‌థ బాక్సింగ్ నేపథ్యంలో సాగుతుంది. అందుకే బాక్సింగ్ కోర్టుకు సంబంధించిన సెట్‌ను అన్న‌పూర్ణ ఏడెక‌రాల స్టూడియోలో ఏర్పాటు చేస్తున్నారు. ఇందుకు దాదాపు 50 మంది ప‌నిచేస్తున్నారు. కోర్టు రింగ్‌లో బాక్సింగ్ ఆడే క్ర‌మంలో అందుకు సంబంధించిన కింద బెడ్‌ల‌ను ప‌ర్య‌వేక్ష‌కుల స‌మ‌క్షంలో తీర్చిదిద్దుతున్నారు. ఈనెలాఖ‌రు నుంచి అక్క‌డ బాక్సింగ్ పోటీని చిత్రీక‌రించ‌నున్నారు. 
 
కిరణ్ కొర్రపాటి ఈ చిత్రం ద్వారా ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. యూవీ క్రియేష‌న్స్ బేన‌ర్‌పై ఈ చిత్రం రూపొందుతోంది. ఇటీవ‌లే నిర్మాతలు జులై 30 న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుందని ప్రకటించారు. అన్నీ అనుకూలిస్తే అప్ప‌టికి రానుంది. కానీ ప్రభాస్ హీరోగా నటించిన మోస్ట్ ఎవైటింగ్  సినిమా ‘రాధేశ్యామ్’ కూడా రిలీజ్ కానుంది. ఇటివలే టీజర్ రిలీజ్ చేసి డేట్ లాక్ చేసి అఫీషియల్ గా ఎనౌన్స్ చేసారు  ఇలా ఉన్నపళంగా తమ సినిమా రిలీజ్ డేట్ కి ప్రభాస్ సినిమా రానుండటంతో ‘గని’ విడుదలను వాయిదా వేసుకొనే ఆలోచనలో ఉన్నారట మేకర్స్. త్వరలోనే మరో డేట్ ఫిక్స్  ఎనౌన్స్ చేసే ప్లానింగ్ లో ఉన్నట్లు తెలుస్తుంది.