ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 29 నవంబరు 2023 (16:07 IST)

ప్రేమలో చాలాసార్లు విఫలమయ్యాను.. యాంకరింగ్ ఆపను.. శ్రీముఖి

Sreemukhi
స్మాల్ స్క్రీన్‌లో టాప్ యాంకర్‌లలో ఒకరిగా శ్రీముఖి కొనసాగుతోంది. ఆమె టీవీ, ఓటీటీ షోలతో బిజీగా ఉంది. సినిమాల్లో ఆశించిన స్థాయిలో సక్సెస్ కాకపోయినా బుల్లితెరపై మాత్రం తిరుగులేని స్టార్‌గా కొనసాగుతోంది. 
 
ఈ బిజీ షెడ్యూల్‌లో, శ్రీముఖి మంగళవారం తన ఇన్‌స్టాగ్రామ్ ప్రసార ఛానెల్ ద్వారా అభిమానులతో సరదాగా గడిపింది. తన ప్రేమకథతో పాటు పెళ్లికి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను వెల్లడించింది. ప్రేమలో ఎప్పుడైనా విఫలమయ్యారా అని ఓ అభిమాని శ్రీముఖిని అడిగాడు. 
 
అన్న ప్రశ్నకు శ్రీముఖి తనదైన శైలిలో సమాధానమిచ్చింది. తన లవ్ బ్రేకప్ విశేషాలను అభిమానులతో పంచుకుంది. ప్రేమలో చాలాసార్లు విఫలమయ్యానని చెప్పింది. పెళ్లి చేసుకుంటే యాంకరింగ్ ఆపేస్తావా అని ఓ అభిమాని ప్రశ్నించగా.. పెళ్లయినా యాంకరింగ్ ఆపనని స్పష్టం చేసింది. తప్పకుండా పెళ్లి చేసుకుంటానని బదులిచ్చింది. 
 
అయితే ఎవరు ఎప్పుడు అనేది క్లారిటీ ఇవ్వకుండా సస్పెన్స్‌గా మిగిలిపోయింది. నా గురించి చాలా చెబుతూ మీకు దగ్గరగా ఉండాలనుకుంటున్నాను అని బ్రాడ్‌కాస్ట్ ఛానెల్‌లో పెట్టాను అంటూ ఓ అభిమాని ప్రశ్నకు శ్రీముఖి సమాధానమిచ్చారు. 
 
ప్రస్తుతం, స్టార్ మా పరివారం, డ్యాన్స్ ఐకాన్, సారంగదరియాతో పాటు ఆదివారాల్లో ఆహా OTTలో ప్రసారం అవుతున్న కామెడీ స్టాక్ ఎక్స్ఛేంజ్ సీజన్ 2కి శ్రీముఖి యాంకర్‌గా ఉన్నారు.