సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : మంగళవారం, 1 అక్టోబరు 2024 (15:58 IST)

గేమ్ చేంజర్ సాంగ్ కు కాలేజీ కుర్రాళ్ళయిపోయిన శ్రీకాంత్, ఎస్.జె. సూర్య

Srikanth, SJ surya
Srikanth, SJ surya
రామ్ చరణ్, డైరెక్టర్ శంకర్ కాంబినేషన్‌లో రూపొందుతోన్న భారీ బడ్జెట్ చిత్రం ‘గేమ్ చేంజర్’. శ్రీమ‌తి అనిత స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్, దిల్‌రాజు ప్రొడ‌క్ష‌న్స్‌ బ్యానర్స్‌పై దిల్ రాజు, శిరీష్  నిర్మిస్తోన్న ఈ సినిమాలో కియారా అద్వాని హీరోయిన్‌.  2024 క్రిస్మస్ సందర్భంగా సినిమాను తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో విడుదలకు సిద్ధ‌మ‌వుతోన్న ఈ సినిమా నుంచి సెకండ్ సాంగ్ ‘రా మ‌చ్చా మ‌చ్చా..’ సాంగ్‌ను సెయింట్ మార్టిన్స్ కాలేజ్‌లో స్టూడెంట్స్ స‌మ‌క్షంలో విడుద‌ల చేశారు. 
 
ఈ సంద‌ర్భంగా పాటకు అనుగుణంగా డాన్స్ వేస్తూ కుర్రాళ్ళతోపాటు శ్రీకాంత్, ఎస్.జె.సూర్య డాన్స్ చేసేశారు. యూత్ డాన్సర్లకు ధీటుగా చేసిన ఈ డాన్స్ కాలేజీ కుర్రాళ్ళను మరింత ఉత్సాహానిచ్చింది. 
 
చిత్ర నిర్మాత దిల్‌రాజు మాట్లాడుతూ ‘‘‘గేమ్ చేంజర్’ ప్రమోషన్స్ ఈ కాలేజ్ నుంచే స్టార్ట్ చేశాం.  జెంటిల్‌మేన్ నుంచి శంక‌ర్‌గారు డైరెక్ట్ చేసిన అన్నీ సినిమాలు నాకు ఇష్ట‌మే. ప్ర‌తీ సాంగ్‌ను ఆయ‌న ఎంతో స్పెష‌ల్‌గా తెర‌కెక్కిస్తుంటారు. ‘గేమ్ చేంజర్’లోనూ ఐదు పాట‌ల‌ను ఐదు ర‌కాలుగా విజువ‌లైజేష‌న్ చేశారు. మ‌రో మూడు అద్భుత‌మైన పాట‌లు రానుంది. ట్రిపులార్ త‌ర్వాత రామ్ చ‌ర‌ణ్ చేసిన ‘గేమ్ చేంజర్’ను క్రిస్మ‌స్ సంద‌ర్భంగా విడుద‌ల చేస్తున్నాం. ఈరోజు విడుదల చేసిన రా..మచ్చా.. సాంగ్ కు  శ్రీకాంత్, ఎస్.జె.సూర్య డాన్స్ చేయడంతో సినిమాపై మరింత నమ్మకం ఏర్పడింది అన్నారు.
 
డైరెక్ట‌ర్ శంక‌ర్ మాట్లాడుతూ,  ప‌క్కా తెలుగు సినిమాలా ప్ర‌తి విష‌యంలో కేర్ తీసుకుని ఎంతో జాగ్ర‌త్త‌గా దీన్ని తెర‌కెక్కించాను.  హీరో ఇంట్ర‌డ‌క్ష‌న్ సాంగ్ ఏ సినిమాలోనూ చేయ‌లేదు. కానీ తొలిసారి ‘గేమ్ చేంజర్’లో అలాంటి హీరో ఇంట్రోసాంగ్ చేశాను. తెలుగు సంస్కృతిని చూపించ‌టానికి 1000 మంది జాన‌ప‌ద క‌ళ‌కారుల‌తో పాట‌ను చిత్రీక‌రించాం. త‌మ‌న్‌గారు రెండు రోజులు అన్నీ ట్యూన్స్‌ను రికార్డ్ చేసి ఈ పాట‌ను త‌మ‌న్‌గారు చేయ‌టం విశేషం. అనంత్ శ్రీరామ్‌గారు పాట‌ను అద్భుతంగా రాశారు. ఈ పాట‌ను రేపు స్క్రీన్‌పై చూస్తున్న‌ప్పుడు నోస్టాల‌జిక్ ఫీలింగ్ వ‌స్తుంది’’ అన్నారు.
 
మ్యూజిక్ డైరెక్ట‌ర్ ఎస్‌.ఎస్‌.త‌మ‌న్ మాట్లాడుతూ ‘‘ఇర‌వై ఏళ్ల క్రితం శంక‌ర్‌గారి ద‌ర్శ‌క‌త్వంలో బాయ్స్ అనే సినిమా చేశాను. అప్పుడు నా ద‌గ్గ‌రుండే చిన్న కీ బోర్డ్‌తో ఆయ‌న‌కొక ట్యూన్ వినిపించాను. త‌ర్వాత ఆయ‌న ప్రొడ‌క్ష‌న్‌లో తెర‌కెక్కిన వైశాలి సినిమాతో మ్యూజిక్ డైరెక్ట‌ర్‌గా మారాను. ఇప్పుడు ఆయ‌న ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న ‘గేమ్ చేంజర్’ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నాను. జ‌ర‌గండి సాంగ్ త‌ర్వాత రా మచ్చా మ‌చ్చా.. సాంగ్‌ను అంద‌రికీ అందిస్తున్నాం. త్వ‌ర‌లోనే మ‌ళ్లీ అంద‌రినీ క‌లుద్దాం. అనంత శ్రీరామ్‌గారు పాట‌ను అద్భుతంగా రాశారు. దిల్‌రాజుగారితో వ‌కీల్ సాబ్ త‌ర్వాత ‘గేమ్ చేంజర్’ మూవీ చేయ‌టం మెమొర‌బుల్ ఎక్స్‌పీరియెన్స్‌’’ అన్నారు.
 
అనంత్ శ్రీరామ్ మాట్లాడుతూ ‘‘మా విజయయాత్రలో మొదటి అడుగు సెయింట్ మార్టిన్స్ ఇంజ‌నీరింగ్ కాలేజ్ నుంచే ప్రారంభ‌మైంది. విజ‌యంతో పాటు పుర‌స్కారాలు కూడా అందుకునే చిత్రంగా ‘గేమ్ చేంజర్’ ఉంటుంద‌ని ఈ కాలేజ్ ద్వారా నిరూపిత మ‌వుతుంది. ఈ పాట‌లో రా మ‌చ్చా మ‌చ్చారా.. అనే లైన్ ఇచ్చిన క్రెడిట్ మాత్రం డైరెక్ట‌ర్ శంక‌ర్‌కి మాత్ర‌మే ద‌క్కుతుంది. పాట‌లో అన్నీ లైన్స్ రామ్ చ‌ర‌ణ్‌గారి గురించి ఉంటే ఓ లైన్ మాత్రం చిరంజీవిగారి గురించి ఉంటుంది. ఇంత మంచి పాట రాసే అవ‌కాశం నాకు ఇచ్చిన శంక‌ర్‌గారికి, త‌మ‌న్‌గారికి, దిల్‌రాజుగారికి థాంక్స్‌’’ అన్నారు.