సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By వరుణ్
Last Updated : సోమవారం, 22 జులై 2024 (11:19 IST)

మోస్ట్ పాపులర్ హీరోల జాబితాలో అగ్రస్థానం ఎవరిది?

Prabhas look
ప్రముఖ మీడియా సంస్థ ఆర్మాక్స్ (ఆర్మాక్స్ మీడియా) తాజాగా భారతీయ చిత్రపరిశ్రమలోని మోస్ట్ పాపులర్ హీరోల జాబితాను రిలీజ్ చేసింది. ఇందులో టాలీవుడ్ హీరో ప్రభాస్ అగ్రస్థానంలో నిలిచారు. జూన్ నెలకు సంబంధించి దేశ వ్యాప్తంగా అధిక ప్రజాధారణ కలిగిన హీరోలపై ఓ సర్వే నిర్వహించి, ఓ జాబితాను తయారు చేసింది. దీన్ని తాజాగా విడుదల చేయగా, అందులో ప్రభాస్ అగ్రస్థానంలో నిలించారు. మే నెలలో అగ్రస్థానంలో నిలిచిన ప్రభాస్... జూన్ నెలలోనూ అదే స్థానాన్ని దక్కించుకున్నారు. 
 
ఇకపోతే, బాలీవుడ్ బాషా షారుక్ ఖాన్ రెండులో నిలిచారు. ఇక ఈ జాబితాలో అల్లు అర్జున్, ఎన్టీఆర్‌ను నాలుగు, ఐదు స్థానాల్లో ఉన్నారు. 'గేమ్ ఛేంజర్‌తో రానున్న రామ్ చరణ్ ఈ లిస్టులో తొమ్మిదో స్థానంలో నిలిచారు. మోస్ట్ పాపులర్ హీరోయిన్‌లో జాబితాలో అలియా భట్ మొదటిలోవుండగా, సమంత, దీపికా పదుకొణె తర్వాతి స్థానాలను కైవసం చేసుకున్నారు. 
 
మరోవైపు ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ తెరకెక్కించిన 'కల్కి 2898 ఏడీ' రికార్డులు సృష్టిస్తోంది. రూ.1000 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టిన ఈ చిత్రం తాజాగా బుక్ మై షోలో షారుక్ ఖాన్ 'జవాన్' రికార్డును అధిగమించిన విషయం తెల్సిందే. 12.15 మిలియన్లకుపైగా ఈ మూవీ టికెట్లు అమ్ముడైనట్లు సంస్థ పేర్కొంది. విదేశాల్లో ఇంకా హౌస్ ఫుల్ బోర్డులు దర్శనమిస్తున్నాయని నిర్మాణ సంస్థ తెలిపింది.