శనివారం, 4 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 13 ఏప్రియల్ 2021 (11:26 IST)

ట్రిపుల్ ఆర్ నుంచి కొత్త పోస్టర్.. ఉగాదికి ఫ్యాన్సుకు పండగే పండగ..!

RRR
ఉగాది సందర్భంగా ట్రిపుల్ ఆర్ నుంచి కొత్త పోస్టర్ విడుదలైంది. జక్కన్న రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం రౌధ్రం రణం రుధిరం (ఆర్‌ఆర్‌ఆర్) నుంచి ఉగాది సర్‌ప్రైజ్‌ వచ్చేసింది. ఇందులో ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ని కొంతమంది ఎత్తుకొని పైకి విసురుతూ సందడి చేస్తుండగా, ఇద్దరు హీరోలు చాలా సంతోషంగా నవ్వుతూ కనిపిస్తున్నారు. తాజాగా విడుదలైన ఈ పోస్టర్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. 
 
ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన పోస్టర్లు, రామ్ చరణ్ భీం ఫర్ రామరాజు, ఎన్టీఆర్ రామరాజు ఫర్ భీం వీడియోలు రికార్డులు క్రియేట్‌ చేయడంతో పాటు సినిమాపై భారీ అంచనాలు పెంచాయి. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. దసరా కానుకగా, అక్టోబర్ 13వ తేదీన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
 
పాన్‌ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజుగా రామ్‌చరణ్‌, కొమురంభీమ్‌గా జూనియర్‌ ఎన్టీఆర్‌ నటిస్తున్నారు. చెర్రీతో ఆలియా భట్‌ జోడీ కడుతుండగా తారక్‌కు జంటగా హాలీవుడ్‌ నటి ఒలీవియా మోరిస్‌ నటించనున్నారు. అజయ్ దేవ్‌గన్ ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు.