శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఐవీఆర్
Last Modified: శనివారం, 12 మార్చి 2022 (18:13 IST)

ఇంకా హెమ్మింగ్ లైన్, నెక్ లైన్ గురించే జడ్జ్ చేస్తుంటారా, మీరు మారరా: సమంత సీరియస్ కామెంట్స్

సమంత తాజాగా తన ఇన్ స్టాగ్రాంలో గ్లామర్ ఫోటోలను షేర్ చేసింది. ఈ ఫోటోలను చూసినవారు కొందరు ఆమెను అప్రిషియేట్ చేస్తుంటే ఇంకొందరు ట్రోల్స్ చేస్తున్నారు. దీనిపై సమంత రియాక్ట్ అయ్యింది.

 
మహిళలు ధరించే దుస్తులను కించపరచడం, వారు ఏ జాతికి చెందినవారు, ఇంకా వారి చర్మపు రంగు ఏంటి అనే డర్టీ టాపిక్స్ గురించి కొంతమంది మాట్లాడుతూ సులభంగా అంచనా వేస్తారు. ఇలాంటి వాటిపై సమంత ఓ పోస్ట్ పెట్టారు. స్త్రీల యొక్క హెమ్‌లైన్‌లు, నెక్‌లైన్‌ల ఆధారంగా వారి గురించి వ్యాఖ్యలను పంపే బదులు తమను తాము మెరుగు పరుచుకోవడంపై దృష్టి పెడితే మంచిదని పోస్ట్ చేసింది.

 
ఒక స్త్రీగా తీర్పు చెప్పబడడం అంటే ఏమిటో నాకు ప్రత్యక్షంగా తెలుసు. మహిళలు ధరించే దుస్తులు, వారి జాతి, విద్య, సామాజిక స్థితి, రూపాన్ని, చర్మపు రంగును బట్టి అంచనా వేస్తాము. ఇంకా ఈ జాబితా చాలానే వుంటుంది. 2022 లోకి వచ్చాక కూడా అలాంటి ఆలోచనలు మారడంలేదే అంటూ మండిపడింది.