గురువారం, 9 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By శ్రీ
Last Modified: గురువారం, 22 నవంబరు 2018 (21:34 IST)

సుమంత్ సుబ్ర‌మ‌ణ్యపురం ట్రైల‌ర్ సూప‌ర్

అక్కినేని ఫ్యామిలీ హీరో సుమంత్ న‌టిస్తోన్న 25వ చిత్రం సుబ్ర‌మ‌ణ్య‌పురం. సంతోష్ జాగ‌ర్ల‌పూడి ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఈషా రెబ్బా కథానాయికగా నటిస్తుండగా.. టారస్ సినీ కార్ప్ పతాకంపై ధీరజ్ బొగ్గరం, బీరం సుధాకర్‌రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. డిసెంబ‌ర్ మొద‌టివారంలో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేందుకు రెడీ అవుతోంది. ఈ సంద‌ర్భంగా ట్రైల‌ర్ ను ట్విట్ట‌ర్ ద్వారా రిలీజ్ చేసారు. ఇక ట్రైల‌ర్ విష‌యానికి వ‌స్తే...సూపర్ నాచురల్ అంశాల మేళవింపుతో సాగే మిస్టరీ థ్రిల్లర్‌గా ఈ టీజర్ ఉంది. 
 
నాస్తికుడిగా, దేవుడంటే నమ్మకం లేని వ్యక్తిగా నటించిన సుమంత్.. భక్తి ముసుగులో జరిగే మోసాల్ని వెతికిపట్టే పనిలో పడ‌తాడు. దేవుడంటే నమ్మకం లేని హీరో.. సుబ్రహ్మణ్యపురం అనే ఊరి కోసం దేవుడితో ఎలా పోరాడాడు? ఎందుకు పోరాడాడు? అసలు దేవుడిని ఎందుకు ఎదిరించాడు? దేవుడి ముసుగులో ఉన్న దుష్టశక్తులు ఏంటి? అనే ఆసక్తికరమైన కథతో, ఉత్కంఠత కలిగించే స్క్రీన్ ప్లే‌ ఇందులో కనిపిస్తుంది. శేఖర్ చంద్ర బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌తో మరోసారి సారి మార్క్ చూపించారు.  
 
భగవంతుడ్ని సెర్చ్ చేసే చోటకు ఆ భగవంతుడి పైనే రీసెర్చ్ చేస్తున్నావ్. నీకు దేవుడంటే నమ్మకం లేకపోతే అది నీ ఖర్మ అంటూ హీరోయిన్ ఇషా రెబ్బా చెప్పిన సంభాషణలు ఆసక్తికరంగా ఉన్నాయి. టోట‌ల్ గా ట్రైల‌ర్ సూప‌ర్ అనేలా ఉంది. మ‌రి..ఈ సినిమా సుమంత్ కి ఆశించిన విజ‌యాన్ని అందిస్తుంద‌ని ఆశిద్దాం.