గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఐవీఆర్
Last Updated : మంగళవారం, 22 అక్టోబరు 2024 (12:53 IST)

ఆకాశంలో సూర్యచంద్రులు- ఆంధ్రలో చంద్రబాబు, పవన్ కల్యాణ్ అంటున్నారు: Unstoppable బాలయ్య

Balakrishna-Chandrababu
ఇటీవలే నటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి కోసం ప్రత్యేకంగా Unstoppable షో షూట్ చేసారు. ఇందులో ఎన్నో ఆసక్తికరమైన విషయాలను ఆయన పంచుకున్నట్లు, పంచ్ డైలాగులు కొట్టినట్లు తాజాగా విడుదలైన ప్రోమోలో కనబడుతోంది. ఈ ప్రమోలో బాలయ్య... ఆకాశంలో సూర్యచంద్రులు- ఆంధ్రలో చంద్రబాబు, పవన్ కల్యాణ్ అంటున్నారు అని బాలకృష్ణ అనగానే... మేము మీ ప్రోగ్రాములా రాజకీయాలలో Unstoppable గా వుంటామని సీఎం చంద్రబాబు అన్నారు.
అతిసారం బాధితులకు పవన్ రూ. 10 లక్షల సాయం: అద్భుత నాయకుడు అంటూ ప్రశంస
విజయనగరం జిల్లా గుర్ల గ్రామంలో అతిసారం బారిన పడిన కుటుంబాలను ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పరామర్శించారు. అనంతరం ఆయన మృతి చెందిన వారి కుటుంబాలకు తన సొంత నిధుల నుండి ఒక్కో కుటుంబానికి లక్ష రూపాయల చొప్పున పది కుటుంబాలకు 10 లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు.
 
ప్రభుత్వం తరపున కూడా ముఖ్యమంత్రి గారితో మాట్లాడి సాయం అందేట్లు ప్రయత్నం చేస్తానని చెప్పారు. పవన్ కల్యాణ్ అక్కడికక్కడే సాయం ప్రకటించడం పట్ల సర్వత్రా కృతజ్ఞతలు తెలుపుతున్నారు. సమస్యల గురించి మాట్లాడి ఇతర పార్టీలను విమర్శిస్తూ ఒక్క పైసా సాయం చేయనివారిని ఇప్పటివరకూ చూస్తూ వస్తున్నామనీ, మొదటిసారిగా సమస్య వుంటే వెంటనే స్పందించి సహాయం చేసే నాయకుడు పవన్ కల్యాణ్‌ను చూస్తున్నామంటూ ప్రశంసిస్తున్నారు అక్కడి ప్రజలు.