గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 5 ఫిబ్రవరి 2023 (14:37 IST)

ప్రేమ అనే కాన్సెప్ట్ తనకు సెట్ కాదు : సందీప్ కిషన్

Sandeep Kishan
ప్రేమ అనే కాన్సెప్ట్ తనకు సెట్ కాదని హీరో సందీప్ కిషన్ అన్నారు. ఆయన తాజాగా నటించిన చిత్రం మైఖేల్. మంచి పాజిటివ్ టాక్‌‍తో దూసుకెళుతోంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రేమ అనే కాన్సెప్ట్ తనకు సెట్‌ కాదన్నారు. ప్రస్తుతానికి తాను ఎవరితోనూ ప్రేమలో లేనని క్లారిటీ ఇచ్చారు. సమయం వచ్చినప్పుడు తప్పకుండా రిలేషన్‌లోకి వెళ్తానన్నారు. పైగా, తాను బ్రేకప్‌ బాధను చూశానని చెప్పుకొచ్చారు. 
 
'ప్రస్తుతానికి నేను రిలేషన్‌షిప్‌లో లేను. అది నాకు సెట్‌ కాదు. నేను చాలా ఎమోషనల్‌. నా భాగస్వామి మీద ఎక్కువగా ఆధారపడతాను. అన్నివిషయాల్లో తన అభిప్రాయం తీసుకోవాలనుకుంటాను. ఎప్పుడూ తనతోనే మాట్లాడాలని, తనకే సమయం కేటాయించాలని భావిస్తాను. అంత ఈజీగా వదులుకోలేను. కాబట్టి.. నాలాంటి వ్యక్తికి రిలేషన్‌ చాలా డేంజరస్‌. అందరిలాగానే గతంలో నాక్కూడా ప్రేమలో ఎదురుదెబ్బలు తగిలాయి. గతేడాది బ్రేకప్‌ దెబ్బ గట్టిగానే తగిలింది' అని సందీప్‌ వివరించారు. 
 
ఓ నటితో తాను రిలేషన్‌లో ఉన్నట్లు వచ్చిన వార్తల్లో ఎలాంటి నిజం లేదని చెప్పారు. ఆమె తనకి మంచి స్నేహితురాలు మాత్రమేనని తెలిపారు. లాక్‌డౌన్‌ తర్వాత మనుషుల మనస్తత్వంలో ఎంతో మార్పు వచ్చిందని, ఇప్పుడున్న రోజుల్లో ఒక బంధాన్ని కాపాడుకోవడం కష్టమైన పని అని తెలిపారు.