Super iconic: ఆన్ స్క్రీన్ శ్రీదేవిగా నటించాలనుంది.. తమన్నా భాటియా
శ్రీదేవి 2018లో దురదృష్టవశాత్తూ బాత్ టబ్‌లో పడి నీటిలో మునిగి మృతి చెందిన విషయం తెలిసిందే. శ్రీదేవి సూపర్ ఐకానిక్ అని, ఆన్ స్క్రీన్ శ్రీదేవిగా నటించాలని కోరుకుంటున్నట్టు తమన్నా తెలిపింది. శ్రీదేవి మేడమ్‌ను ఆరాధించే వ్యక్తుల్లో తాను కూడా ఒకరని తమన్నా ఈ సందర్భంగా చెప్పుకొచ్చింది. ఆమెను "సూపర్ ఐకానిక్" అని పిలిచింది.
స్టీరియోటైప్ పాత్రల నుంచి కామెడీ, డ్రామా వరకు ఎన్నో జానర్లలో పలు విభిన్న పాత్రలను పోషించి ఇండియన్ సినీ హిస్టరీలోనే మొదటి మహిళా సూపర్ స్టార్‌గా శ్రీదేవి గుర్తింపు పొందారని తమన్నా చెప్పింది.
తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో శ్రీదేవి 50 సంవత్సరాలకు పైగా వివిధ రంగాల్లో కొనసాగారని చెప్పారు. తాను ఆమెను ఎల్లప్పుడూ ఆరాధిస్తానని తమన్నా తెలిపారు. ఇక తమన్నా విషయానికొస్తే అమ్మడు ఆఖరిగా నీరజ్ పాండే దర్శకత్వంలో వచ్చిన సికిందర్ కా ముఖద్దర్ సినిమాలో నటించింది.
ఈ సినిమాలో జిమ్మీ షీర్ గిల్, అవినాష్ తివారీ, రాజీవ్ మెహతా, దివ్య దత్తా కీలక పాత్రల్లో నటించారు. ప్రస్తుతం తమన్నా తెలుగులో చేస్తున్న ఓదెల2 త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.