శనివారం, 30 నవంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ప్రీతి చిచ్చిలి
Last Updated : గురువారం, 30 మే 2019 (12:34 IST)

మా సినిమాకు అందుకే ఆ పేరు పెట్టాం.. హీరో క్లారిటీ

కోలీవుడ్ హీరోలలో మంచి క్రేజ్ ఉన్న నటుడు సూర్య. విభిన్న పాత్రలు గల సినిమాలను ఎంచుకుంటూ తమిళ ప్రేక్షకుల మదిలోనే కాకుండా తెలుగువారి మనసులోనూ చోటు సంపాదించుకున్నాడు. ఆయన నటించిన సింగం సినిమా టాలీవుడ్‌లో కూడా మంచి హిట్ సాధించిన విషయం తెలిసిందే.


తాజాగా ఈ హీరో నటిస్తున్న సినిమా 'ఎన్‌.జి.కె (నంద గోపాల కృష్ణ)', దీనికి '7జి బృందావన కాలని', 'ఆడవారి మాటలకు అర్థాలే వేరులే' చిత్రాల దర్శకుడు శ్రీరాఘవ దర్శకత్వం వహిస్తుండగా డ్రీమ్‌ వారియర్‌ పిక్చర్స్‌, రిలయన్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ వారు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.
 
ఈ సినిమాను తమిళనాడుతో పాటుగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలలో విడుదల చేయాలని నిర్ణయించుకున్న నేపథ్యంలో ప్రముఖ నిర్మాత, శ్రీ సత్యసాయి ఆర్ట్స్‌ అధినేత కె.కె.రాధామోహన్‌ అందిస్తున్నారు.

అయితే ఈ సినిమా పేరు ఇంగ్లీష్‌లో పెట్టడానికి గల కారణాన్ని వివరిస్తూ సూర్య... ఈ సినిమాకు సరిపోయే టైటిల్ కోసం వెతుకుతున్న తరుణంలో తమిళం‌, తెలుగు భాషల్లో వేర్వేరు టైటిల్ పెట్టాలని భావించాము.

అయితే రెండు భాషల్లో ఒకే టైటిల్‌ పెడితే బాగుంటుందని, అప్పుడే ఆడియన్స్ రీచ్ ఎక్కువగా ఉంటుందని మా పి.ఆర్‌ టీమ్‌, అలాగే డిస్ట్రిబ్యూటర్స్‌ సలహా ఇవ్వడంతో ఈ టైటిల్ పెట్టడం జరిగింది.
 
ఈ మధ్యకాలంలో రాజకీయ ట్రెండ్ నడుస్తున్న నేపథ్యంలో పొలిటికల్ బ్యాక్‌డ్రాప్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అందాల భామలు రకుల్ ప్రీత్ సింగ్, సాయిపల్లవి హీరోయిన్లుగా నటిస్తున్నారు.