మంగళవారం, 7 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : బుధవారం, 7 ఏప్రియల్ 2021 (17:58 IST)

`చెరసాల` టీజర్ ఆవిష్క‌రించిన‌ యస్వీ కృష్ణా రెడ్డి

cherasala ph
భార్యాభ‌ర్త‌ల రిలేషన్ ఎలా ఉండాలి? ఎలా ఉండకూడదు? అనే కథాశంతో  ఫీల్ గుడ్ లవ్ స్టోరీగా తెరకెక్కిన చిత్రమే "చెరసాల". ఎస్ రాయ్ క్రియేషన్స్ పతాకంపై శ్రీజిత్ ,రామ్ ప్రకాష్ గుణ్ణం, నిష్కల, శిల్పా దాస్ హీరో, హీరోయిన్లుగా రామ్ ప్రకాష్ గుణ్ణం దర్శకత్వంలో మద్దినేని సురేష్ సుధా రాయ్ నిర్మిస్తున్నారు..ట్రైల‌ర్‌ను ఎస్వి కృష్ణారెడ్డి  విడుదల చేశారు , టీజ‌ర్‌ను ఫిల్మ్ ఛాంబర్ కౌన్సిల్ సెక్రటరీ ప్రసన్న కుమార్ విడుదల చేశారు. నిర్మాత ఆచంట గోపీనాథ్, బసి రెడ్డిలు "చెరసాల" చిత్రంలోని పాటలను విడుదల చేశారు.
 
ఎస్ వి కృష్ణారెడ్డి మాట్లాడుతూ, ఈ చిత్ర టీజర్ ను నేను లాంచ్ చేయడం చాలా ఆనందంగా ఉంది. కెమెరామెన్ దర్శకుడిగా మారి ఈ చిత్రాన్ని చాలా చక్కగా తెరకెక్కించాడు. సినిమా మేకింగ్ చాలా బాగుంది .నిర్మాతలు దర్శకుడికి ఫ్రీడం ఇవ్వడం వలన సినిమా ఇంత బాగా వచ్చింది. దర్శక,నిర్మాతలు నాకీ సినిమాను చూయించారు. సినిమా చాలా బాగుంది.త్వరలో విడుదల అవుతున్న ఈ చిత్రం దర్శక, నిర్మాతలకు  పెద్ద విజయం సాధించి మంచిపేరు తో పాటు,డబ్బులు కూడా రావాలని కోరుకుంటున్నానని అన్నారు
 
ప్రసన్న కుమార్ మాట్లాడుతూ, పది సంవత్సరాలుగా చిత్ర దర్శకుడు కెమెరామెన్ గా చేస్తూ 24 క్రాఫ్ట్స్ గురించి తెలుసుకొని తనే కథ తయారు చేసుకుని దర్శకుడికి మారడం చాలా మంచి శుభ పరిణామం.ఇది తనకు మొదటి సినిమా అయినా ఎంతో అనుభవం ఉన్న దర్శకుడిలా సినిమాను తెరకెక్కించాడు. మంచి కంటెంట్ తో వస్తున్న హర్రర్ ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా  ప్రేక్షకులందరికీ తప్పకుండా నచ్చుతుందని అన్నారు.
 
ఆచంట గోపీనాథ్, బసిరెడ్డి లు మాట్లాడుతూ, ఈ మధ్య వస్తున్న హర్రర్ సినిమాలన్నీ చిన్న సినిమాలుగా విడుదలై మంచి విజయం సాధించి పెద్ద సినిమాల సరసన చేరుతున్నాయి. త్వరలో విడుదల అవుతున్న ఈ "చెరసాల" సినిమా కూడా గొప్ప విజయం సాధించి పెద్ద సినిమాల సరసన చేరాలని కోరుతూ చిత్ర యూనిట్ కు అభినందనలు  తెలియజేశారు.
 
చిత్ర దర్శకుడు రామ్ ప్రకాష్ గుణ్ణం మాట్లాడుతూ, గత పది సంవత్సరాలుగా సినిమాటోగ్రాఫర్ గా వర్క్ చేస్తూ 24 క్రాఫ్ట్స్ ఎలా వర్క్ చేస్తాయో తెలుసుకుని ఇండస్ట్రీలో నాకంటూ ఒక చిన్న గుర్తింపు ఉండాలనే తపనతో..ఈ కథ రాసుకోవడం జరిగింది. కరొనా టైంలో స్ట్రగుల్ ఫేస్ అయినా ఈ సినిమా విడుదల తో మాకు హ్యాపీ ఎండింగ్ అవుతుందని ఆశిస్తున్నాను. నేను ఈ సినిమాను ఒక డైరెక్టర్ పాయింటాఫ్ వ్యూలో కాకుండా ఒక ఆడియన్ కు ఏది నచ్చుతుంది,ఏది నచ్చదో తెలుసుకొని ఆడియన్స్  పాయింటాఫ్ వ్యూలో అందరికీ నచ్చేలా ఈ సినిమా తీయడం జరిగింది. త్వ‌ర‌లో విడుద‌ల‌చేస్తామ‌న్నారు.
 
చిత్ర నిర్మాత సుధారాయ్ మాట్లాడుతూ, అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని త్వరలో మీ ముందుకు వస్తున్న మా సినిమాను మీరందరూ ఆదరించి ఆశీర్వదించాలని కోరుతున్నానని అన్నారు.
 
చిత్ర హీరో సుజిత్ మాట్లాడుతూ, నా మొదటి తెలుగు సినిమా "చెరసాల. దర్శకనిర్మాతలు నాపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నానని అనుకుంటున్నాను.ఈ సినిమాలో నేను లీడ్ రోల్ ప్లే చేసినా కానీ కంటెంటే హీరో .మేమంతా ఈ కంటెంట్ ని దృష్టిలో పెట్టుకొనే నటించడం జరిగింది. ఈ సినిమా అన్ని వర్గాల వారికి నచ్చే ఫుల్ ప్యాకేజ్డ్ మూవీ అని కచ్చితంగా చెప్పగలను.ఈ సినిమాలో నటించే అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు కృతజ్ఞతలు అని అన్నారు. హీరోయిన్ నిష్కల, శిల్పా దాస్ కూడా మాట్లాడారు.