శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By TJ
Last Modified: బుధవారం, 25 జులై 2018 (19:59 IST)

అది లేకుండా నేను బతకలేనేమో... మిల్కీ బ్యూటీ తమన్నా

హ్యాపీ డేస్ సినిమాతో తెలుగుసినీపరిశ్రమలో అడుగుపెట్టిన తమన్నా ప్రస్తుతం పదిసంవత్సరాలు పూర్తి చేసుకుంది. పది సంవత్సరాలంటే వయస్సులో కాదు సినీపరిశ్రమలో తన జర్నీ ఆవిధంగా పూర్తయ్యింది. అంతేకాదు అగ్ర హీరోయిన్లలో ఒకరుగా ఆమె కొనసాగుతూనే ఉన్నారు. తెలుగు, తమిళ

హ్యాపీ డేస్ సినిమాతో తెలుగుసినీపరిశ్రమలో అడుగుపెట్టిన తమన్నా ప్రస్తుతం పదిసంవత్సరాలు పూర్తి చేసుకుంది. పది సంవత్సరాలంటే వయస్సులో కాదు సినీపరిశ్రమలో తన జర్నీ ఆవిధంగా పూర్తయ్యింది. అంతేకాదు అగ్ర హీరోయిన్లలో ఒకరుగా ఆమె కొనసాగుతూనే ఉన్నారు. తెలుగు, తమిళ సినీపరిశ్రమతో పాటు బాలీవుడ్‌లో కూడా రాణిస్తూ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంటోంది.
 
ఎదిగిన కొద్దీ ఒదిగి ఉండమనేది తమన్నాను చూసి నేర్చుకోవాలి. ఎప్పుడూ తనలో కాస్తంత అహం అనేది కనిపించదని సినీపరిశ్రమలోని వారే చెబుతుంటారు. ప్రతిరోజు షూటింగ్‌కు కరెక్టు సమయానికి రావడం.. డైరెక్టర్‌తో తాను ఏం చేయాలో తెలుసుకుని ఒకే ఒక్క షాట్లో పూర్తి చేయడం తమన్నాకు అలవాటట. ఎప్పుడూ కూడా తాను అగ్ర హీరోయిన్ అన్న విషయాన్ని పక్కనబెట్టి సినిమా యూనిట్ సభ్యులందరితోను బాగా కలిసిపోతుందట. 
 
అంతేకాదు ప్రతిరోజు షూటింగ్ త్వరగా ప్రారంభమవుతుందా అని ఎప్పుడూ కాచుకుని కూర్చుంటుందట తమన్నా. కారణం రోజూ తాను నిత్య విద్యార్థి అని.. ఎప్పుడూ కొత్త విషయాల్ని, కొత్త వ్యక్తులను కలవాలని ఉబలాటపడుతుంటానని చెబుతోంది తమన్నా. షూటింట్ లేకుంటే నేను బతకలేమోనని కూడా చెప్పేస్తోంది. ఏదో ఒక సినిమాలో నటిస్తూ ఉండాలి. షూటింగ్ కొనసాగుతూనే ఉండాలి. ఎక్కడా గ్యాప్ రాకుండంటోంది తమన్నా. మరి సినిమా అవకాశాలు ఇప్పుడు ఆమెకు పుష్కలంగా ఉన్నాయి సరే... లేకుంటే సంగతేమిటో మరి.