ఆదివారం, 26 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By TJ
Last Modified: సోమవారం, 22 జనవరి 2018 (14:24 IST)

ఏ యాంగిల్ అయినా చేయగలను... మిల్కీ బ్యూటీ తమన్నా..

సినిమా పరంగా నేను ఏదైనా చేయగలనన్న నమ్మకం నాలో ఏర్పడింది. ఖచ్చితంగా చేస్తాను అన్న ధీమా మా కుటుంబ సభ్యుల్లో బాగా పాతుకుపోయింది. చిన్న హీరోయిన్‌గా తెలుగు సినీపరిశ్రమలో కాలుపెట్టి ఇప్పుడు అగ్రహీరోయిన్ల స్థాయికి నేను ఎదిగానంటే నా కాన్ఫిడెంటే ప్రధానంగా చెప

సినిమా పరంగా నేను ఏదైనా చేయగలనన్న నమ్మకం నాలో ఏర్పడింది. ఖచ్చితంగా చేస్తాను అన్న ధీమా మా కుటుంబ సభ్యుల్లో బాగా పాతుకుపోయింది. చిన్న హీరోయిన్‌గా తెలుగు సినీపరిశ్రమలో కాలుపెట్టి ఇప్పుడు అగ్రహీరోయిన్ల స్థాయికి నేను ఎదిగానంటే నా కాన్ఫిడెంటే ప్రధానంగా చెప్పుకోవచ్చు. ముందు నుంచి నన్ను ఎంకరేజ్ చేసిన దర్సకులకు నేను రుణపడి ఉంటాను. మొదట్లో దర్సకుడు శేఖర్ కమ్ముల ప్రోత్సాహంతో సినీపరిశ్రమలోకి వచ్చాను. ఆ తరువాత వెనుతిరిగి చూడాల్సిన అవసరం నాకు రాలేదు.
 
ఇప్పుడు ఏ డ్యాన్స్ అయినా, ఎలాంటి క్యారెక్టర్ అయినా చేయగలను. నేను చేస్తానన్న ధీమాతో పాటు నేను చేయగలనన్న నమ్మకం దర్సకుల్లో ఏర్పడటం నాకు ఎంతో సంతోషంగా ఉందంటోంది తమన్నా. నా కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతో డ్యాన్సులలో కొత్త యాంగిల్స్ నేర్చుకుంటున్నాను. అది కూడా పూర్తయ్యింది. ఒక చోట నేను డ్యాన్స్ ప్రాక్టీస్ చేసిన తరువాత నా స్నేహితులంతా మైకేల్ జాక్సన్‌ను మించి పోయేట్లున్నావే అంటూ ఆటపట్టిస్తున్నారు. నా డ్యాన్స్ చాలా మెరుగైందని దర్శకులు కూడా చెబుతున్నారు. నాకు చాలా ఆనందంగా ఉంది అంటోంది మిల్కీ బ్యూటీ తమన్నా. కళ్యాణ్‌ రామ్ కథానాయకుడిగా తెరకెక్కుతున్న నా నువ్వే చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తోంది తమన్నా. మరో రెండు సినిమా షూటింగ్‌లో బిజీగా గడుపుతోంది.