శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 27 ఫిబ్రవరి 2022 (10:43 IST)

సీపీఐ కె.నారాయణను చెప్పుతో కొట్టాదాన్ని : తమన్నా

'బిగ్ బాస్' హౌస్‌ను ఒక వ్యభిచార గృహంతో పోల్చిన సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణను చెప్పుతో కొట్టాలని బిగ్ బాస్ కంటెస్టెంట్ తమన్నా సింహాద్రి ఘాటుగా వ్యాఖ్యానించారు. బిగ్ బాస్ హౌస్‌ను వ్యభిచార గృహమంటూ నారాయణ పదేపదే వ్యాఖ్యానిస్తున్నారు. ఈ వ్యాఖ్యలపై పలువురు సినీ నటులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటివారిలో బిగ్ బాస్ హోస్ట్, హీరో అక్కినేని నాగార్జున కూడా ఉన్నారు. తాజాగా బిగ్ బాస్ కంటెస్టెంట్ తమన్నా సింహాద్రి కూడా ఈ జాబితాలో చేరిపోయారు. 
 
సీపీఐ నేత నారాయణ వ్యాఖ్యలపై తాజాగా ఓ టీవీ చర్చా కార్యక్రమాన్ని నిర్వహించింది. ఇందులో తమన్నా సింహాద్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఈ చర్చా కార్యక్రమానికి నారాయణను కూడా పిలవాల్సిందని, బ్రోతల్ హౌస్ అన్నందుకు నారాయణనను చెప్పుతో కొట్టివుండేదాన్నని ఆమె ఘాటుగా వ్యాఖ్యానించారు. 
 
ఈ వ్యాఖ్యలకు ఈ చర్చా కార్యక్రమంలో పాల్గొన్న మిగిలిన సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కాగా, తమన్నా చేసిన వ్యాఖ్యలు తప్పు అయితే బిగ్ బాస్ హౌస్‌ను వ్యభిచార గృహంతో పోల్చిన నారాయణ వ్యాఖ్యలు కూడా తప్పే కదా అని న్యూస్ మోడరేటర్ అనడం గమనార్హం. పైగా, బిగ్ బాస్ హౌస్‌లో ఎటువంటి బ్రోతల్ పనులు జరగడం లేదని స్పష్టం చేశారు. కాగా, ఇపుడు ఈ బిగ్ బాస్ కార్యక్రమం బిగ్ బాస్ అల్టిమేట్ పేరుతో డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో 24 గంటల పాటు ప్రసారంకానుంది.