ఆదివారం, 3 మార్చి 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 6 మే 2021 (11:31 IST)

కోలీవుడ్‌ను పగబట్టిన కరోనా వైరస్ : మరో కమెడియన్ మృతి

తమిళ చిత్ర పరిశ్రమను కరోనా వైరస్‌ పగబట్టినట్టు తెలుస్తోంది. ఇప్పటికే పలువురు సినీ సెలెబ్రిటీలు కరోనా వైరస్ సోకి ప్రాణాలు కోల్పోయారు. తాజాగా మరో హాస్యనటుడు కరోనా వైరస్ సోకి చనిపోయారు. ఆయన పేరు పాండు. వయసు 74 యేళ్లు. 
 
క‌రోనాతో కొద్ది రోజులుగా చెన్నైలోని ప్రైవేట్ ఆసుప‌త్రిలో చికిత్స పొందుతున్న ఆయ‌న గురువారం తుది శ్వాస విడిచారు. పాండుకు భార్య కుముధ, ముగ్గురు కుమారులు ఉన్నారు. అయితే పాండు భార్య‌కు కూడా క‌రోనా సోక‌గా, ఆమె ఆసుప‌త్రిలో చికిత్స పొందుతున్నారు. 
 
పాండు మృతి ప‌ట్ల ప్ర‌ముఖులు సంతాపం తెలియ‌జేశారు. 1970లో మానవన్ తో నటుడిగా అరంగేట్రం చేసిన పాండు ‘కరైల్లెం షేన్‌బాగపూ’తో అతనికి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.
 
మరోవైపు, సీనియర్‌ గాయకుడు, నటుడు టీకేఎస్‌ నటరాజన్‌(87) బుధవారం చెన్నైలో కన్నుమూశారు. ఈయ‌న శివాజీ గణేశన్, ఎంజీఆర్, కమలహాసన్, రజనీకాంత్‌ వంటి ప్రముఖ హీరోల చిత్రాల్లో ముఖ్య పాత్రల్లో నటించి పేరు తెచ్చుకున్నారు. ఈయన అనారోగ్య సమస్యలతో బుధవారం కన్నుమూశారు.