శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 27 ఏప్రియల్ 2021 (08:40 IST)

ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ సతీమణి కన్నుమూత

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ప్రముఖ దినపత్రికల్లో ఒకటైన ఆంధ్రజ్యోతి, న్యూస్ చానెల్ ఏబీఎన్-ఆంధ్రజ్యోతి సంస్థల మేనేజింగ్ డైరెక్టర్ వేమూరి రాధాకృష్ణ భార్య వేమూరి కనకదుర్గ మంగళవారం తెల్లవారుజామున కన్నుమూశారు. ఆమె వయసు 63 సంవత్సరాలు. గత కొంతకాలంగా అనారోగ్యంతో ఉన్న ఆమె, హాస్పిటల్ లో చికిత్స పొందుతూ మృతిచెందారు.
 
ఆమె మరణ వార్తను విన్న పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు రాధాకృష్ణకు తమ సంతాపాన్ని తెలియజేశారు. ఈ విషాదకర సమయంలో ఆయన కుటుంబం ధైర్యంగా ఉండాలని సందేశాలు పంపారు.నేటి మధ్యాహ్నం జూబ్లీహిల్స్ లోని మహాప్రస్థానంలో ఆమె అంత్యక్రియలు జరుగుతాయని కుటుంబీకులు వెల్లడించారు.
 
వేమూరి కనకదుర్గ మృతికి పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు, ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ఉద్యోగులు సంతాపం తెలియజేశారు. దుర్గ మరణంతో ఆంధ్రజ్యోతి సంస్థల ఉద్యోగులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ఇవాళ మధ్యాహ్నం జూబ్లీహిల్స్‌ మహాప్రస్థానంలో అంత్యక్రియలు జరగనున్నాయి. ఆమె ఆంధ్రజ్యోతి సంస్థలకు డైరెక్టరుగా కూడా ఉన్నారు.