మంగళవారం, 10 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శుక్రవారం, 13 మే 2022 (19:22 IST)

స‌ర్కారువారు పాట‌లో మ‌హేష్ డైలాగ్‌లు మైన‌స్ అయ్య‌యా!

Mahesh Babu
మహేష్ బాబు న‌టించిన‌ సర్కారు వారి పాట సినిమా ట్రైలర్‌లో ప‌లికిన కొన్ని డైలాగ్‌ల‌కు ఇప్పుడు మైన‌స్‌గా మారింద‌నే నెటిజ‌న్లు తెలియజేస్తున్నారు. ఈ సినిమా విడుద‌ల‌రోజు పాజిటివ్ టాక్‌తో అంద‌రూ పొగిడినా రానురాను అది స‌న్న‌గిల్లింది. ఎంట‌ర్‌టైన్‌మెంట్ ఫుల్‌గా ఉంది, హీరో హీరోయిన్ల కెమిస్ట్రీకి జ‌నాలు తెగ చూసేస్తార‌ని రిలీజ్‌కుముందు మ‌హేష్ ప‌లికిన ప‌లుకుల‌ను అభిమానులే ప‌ట్టించుకోవ‌డంలేదు. అందుకు కార‌ణం ఈ సినిమాకు రాజ‌కీయ‌రంగు పుల‌మ‌డ‌మే.
 
కృష్ణ కుటుంబం వై.ఎస్‌.ఆర్‌.కు అనుకూలం. అది అంద‌రికీ తెలిసిందే. కానీ సినిమాలో రాజ‌కీయ డైలాగ్‌లు ప‌డ‌డంవ‌ల్ల సర్కారు వారి పాట సినిమాకు మైన‌స్ అయింద‌ని నెటిజ‌న్లు విశ్లేషిస్తున్నారు. హీరోహీరోయిన్ క‌లిసే ఓ సంద‌ర్భంలో `నేను విన్నాను. నేనున్నాను.` అంటూ వై.ఎస్‌. ప‌లికిన ప‌లుకుల‌ను మ‌హేష్‌బాబు ప‌లికాడు. దాంతో ఇది మ‌హేష్ చెప్ప‌కుండా వుండాల్సింద‌ని సోష‌ల్‌మీడియాలో తెగ ప్ర‌చారం జ‌రుగుతోంది. అందువ‌ల్లే వైసి.పి. పార్టీ మిన‌హా మిగిలిన పార్టీల‌కు చెందిన వారెవ‌రూ ఈ సినిమాను చూడ‌డంలేద‌నీ, అందుకే పెద్ద స‌క్సెస్ కాలేక‌పోతుంద‌ని తెలియ‌జేస్తున్నారు.