భీమ్లానాయక్‌పై విక్టరీ వెంకటేష్, నితిన్ ట్వీట్
భీమ్లానాయక్ సినిమాను సాగర్ కె. చంద్ర డైరక్ట్ చేశాడు. ఈ మూవీలో రానా దగ్గుబాటి కీలక పాత్రలో నటించగా.. నిత్యామీనన్ సంయుక్త మీనన్ హీరోయిన్‌లుగా నటించారు.
ఈ చిత్రం ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తోంది. పవన్ నుంచి చాలా రోజుల తరువాత మాస్ మసాలా యాక్షన్ ఎంటర్ టైనర్ రావడంతో ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు.
విక్టరీ వెంటకటేష్ 'భీమ్లానాయక్'పై స్పందించారు. 'భీమ్లానాయక్' మ్యాగ్నిఫిసెన్స్. డేనియల్ శేఖర్ మెరుపుదాడి సక్సెస్‌ను టేకోవర్ చేసుకుంది. రానా నటన అద్భుతం. 'భీమ్లానాయక్' ఘనవిజయం సాధించిన సందర్భంగా టీమ్ అందరికి శుభాకాంక్షలు అని వెంకీ ట్వీట్ చేశారు.
ఇంకా హీరో నితిన్ చేసిన పోస్టు కూడా నెట్టింట వైరల్‌గా మారింది. 'ఇది కదా మాకు కావాల్సింది.. రానా దగ్గుబాటి ఇరగ్గొట్టావ్' అంటూ పవన్ స్కెచ్ ని ముద్దు పెట్టుకుంటున్న ఫొటోని నితిన్ షేర్ చేశాడు.