దేశం కోసం తపన ఆపరేషన్ సింధూర్ సాంగ్ లో కనిపించింది : జెడి లక్ష్మీనారాయణ
JD Lakshminarayana, Ali, Major Oberoi and others
పాకిస్తాన్ టెర్రరిస్ట్ క్యాంపులపై చేసిన ఆపరేషన్ సింధూర్ ను ఇన్స్పిరేషన్ గా తీసుకుంటూ ప్రముఖ ఆరోగ్య డైట్ లక్ష్మణ్ పూడి ఓ పాట రూపంలో తన దేశభక్తిని చూపారు. ప్రసాద్ రచించిన ఈ పాటకు రమేష్ సంగీతాన్ని అందించగా కృష్ణ సినిమాటోగ్రాఫర్ గా చేశారు. ఉమా శంకర్ కొరియోగ్రఫీ చేసిన ఈ పాటకు మనికంట ఎడిటింగ్ చేయగా సత్య శ్రీనివాస్ గారు సంగీత సహకారాన్ని అందించారు. లక్ష్మణ్ పూడి గారు ఈ పాటకు స్వరాన్ని జోడించి స్వీయ దర్శకత్వంలో నటిస్తూ ఈ పాటను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఈ కార్యక్రమానికి జెడి లక్ష్మీనారాయణ, నటుడు అలీ, మేజర్ ఒబెరాయ్, జేఏసీ చైర్మన్ అంజిబాబు, నిర్మాత కూనిరెడ్డి శ్రీనివాస్ తదితరులు హాజరయ్యారు.
జేడీ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ... "మిత్రుడు లక్ష్మణ్ ఆపరేషన్ సింధూర్ పై మన దేశ జవానుల గురించి పాట పాడటం, ఆ పాట లాంచ్ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించడం ఎంతో సంతోషకరం. దేశంలోని జవాన్ల పట్ల ఆయనకు ఉన్న గౌరవాన్ని ఒక పాట రూపంలో మనకు చూపించారు. దానికి వారిని అభినందిస్తున్నాను. ఆయన ఎంత కాలం కేవలం ఆరోగ్యం గురించి డైట్ చెప్తారు అనుకున్నాను కానీ ఆయన తండ్రి కమ్యూనిస్టు పార్టీలో ఉండటంవల్ల ఆయన భావజాలాలు, దేశం కోసం ఏమైనా చేయాలి అనే తపన లక్ష్మణ్ లో ఈ పాట ద్వారా కనిపించాయి. మనం ముఖ్యంగా రైతులకు, జవాన్లకు ప్రాముఖ్యత ఇస్తూ జై కిసాన్ జై జవాన్ అనే నినాదంతో వారిని గౌరవిస్తాము.
గడియారంలో మధ్యాహ్నం 12 గంటలకు భోజనం చేసే సమయానికి ముల్లులు నమస్కరిస్తూ రైతులకు గౌరవం ఇస్తాయి. అదేవిధంగా రాత్రి 12 గంటలకు మన ప్రశాంతంగా పడుకోవడానికి గల కారణంమైన జవాన్లకు మరోసారి అదే గడియారంలోని ముల్లులు నమస్కరిస్తూ వారికి గౌరవం ఇస్థాయి. కొన్ని దేశాలలో కచ్చితంగా వారి జీవితంలోని రెండు సంవత్సరాలు మిలటరీలో ఉంటారు. అదే రూల్ మనదేశంలో కూడా ఉండాలని సూచిస్తున్నాను" అన్నారు.
నటుడు అలీ మాట్లాడుతూ, ఈరోజు స్టేజిపై ఉన్న రియల్ హీరోలను కలవడం మరింత సంతోషాన్ని కలగజేస్తుంది. గడియారంలో కూడా రెండు చేతులు జోడించి నమస్కరించే ఒక గొప్ప విషయాన్ని నేడు మనకు తెలియజేసిన జెడి గారికి ప్రత్యేక ధన్యవాదాలు. లక్ష్మణ్ గారిలో ఒక మంచి గాయకుడున్నాడు, నటుడు ఉన్నాడు. ఆయన మీద ఉన్న అభిమానంతో ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. ఒబెరాయ్ గారు తెలుగులో మాట్లాడుతుంటే ఎంతో గర్వంగా అనిపిస్తుంది. మీరు అనుకున్నది సాధించాలని కోరుకుంటున్నాను" అన్నారు.
జేఏసీ చైర్మన్ అంజిబాబు, మేజర్ ఒబెరాయ్, ఆరోగ్య డైట్ లక్ష్మణ్ పూడి తదితరులు మాట్లాడారు.