ఆదివారం, 12 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శనివారం, 26 అక్టోబరు 2024 (16:56 IST)

మహిళలను మోసం చేసేవారికి సరికొత్త శిక్ష వేసే కథే ఓ అందాల రాక్షసి చిత్రం

Sheraj Mehdi, Vihanshi Hegde, Kriti Verma, Bhashya Sri
Sheraj Mehdi, Vihanshi Hegde, Kriti Verma, Bhashya Sri
దర్శకుడిగా, హీరోగా, సంగీత దర్శకుడిగా, కథకుడిగా షెరాజ్ మెహదీ ఇటు తెలుగు, అటు తమిళ ఆడియెన్స్‌ను ఆకట్టుకుంటూ వస్తున్నారు. షెరాజ్ మెహదీ ప్రస్తుతం తెలుగు ఆడియెన్స్ ముందుకు ‘ఓ అందాల రాక్షసి’ అనే చిత్రంతో హీరోగా, దర్శకుడిగా మరోసారి రాబోతున్నారు. ఈ చిత్రంలో 
 
షెరాజ్ మెహదీ,  విహాన్షి హెగ్డే, కృతి వర్మ హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ఓ అందాల రాక్షసి. సురీందర్ కౌర్ నిర్మాతగా.. తేజిందర్ కౌర్ సహ నిర్మాతగా షేర్ సమర్పణలో ఈ చిత్రం త్వరలో రాబోతోంది. ఇంత వరకు షెరాజ్ మెహదీ హీరోగా, విలన్‌గా, దర్శకుడిగా, సంగీత దర్శకుడిగా తన సత్తాను చాటుకున్నారు. ప్రస్తుతం ఓ అందమైన ప్రేమ కథా చిత్రంతో షెరాజ్ అందరినీ ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఈ మూవీ షూటింగ్ అంతా పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. త్వరలోనే ఈ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా  చిత్ర విశేషాలను తెలియజేశారు.
 
 షెరాజ్ మెహదీ మాట్లాడుతూ* - అందరికీ నమస్కారం. ‘ఓ అందాల రాక్షసి’ సినిమాకు భాష్యశ్రీ  కథ మాటలు, పాటలు రాశారు. స్క్రీన్ ప్లేలో కూడా సపోర్ట్ చేశారు. ఆయన సహకారం వల్లే ఈ సినిమా ఇంత బాగా చేయగలిగాం. ‘ఓ అందాల రాక్షసి’ సినిమా గ్లామర్ బేస్డ్ మూవీ కాదు. మంచి కంటెంట్ ఉన్న సినిమా. ఒకరకంగా ఇది వుమెన్ ఓరియెంటెడ్ మూవీ అనుకోవచ్చు. మహిళల గురించిన అంశాలు ఉంటాయి. అమాయక మహిళలు కొందరి చేతిలో ఎలా మోసపోతున్నారు అనేది సినిమాలో చూపిస్తున్నాం. అలాగే మోసం చేసేవారికి శిక్ష కూడా ఉంటుందని చెబుతున్నాం. సుమన్, తమ్మారెడ్డి భరద్వాజ గారు ఇంపార్టెంట్ రోల్స్ లో నటించారు. సినిమా చాలా బాగా వచ్చింది. త్వరలోనే థియేటర్స్ లో మిమ్మల్ని కలుస్తాం. అన్నారు.
 
 రైటర్ భాష్య శ్రీ మాట్లాడుతూ, ఈ సినిమాకు నేను కథ, మాటలు, పాటలు రాశాను. 45 రోజుల షూటింగ్ తో టాకీ, సాంగ్స్ కంప్లీట్ చేసుకున్నాం. హైదరాబాద్, గోవా, చెన్నై పరిసర ప్రాంతాల్లో షూటింగ్ చేశాం. సినిమా చాలా బాగా వచ్చింది. కంటెంట్ ఓరియెంటెడ్ మూవీ ఇది. గ్లామర్ కు ప్రాధాన్యత ఇవ్వకుండా స్ట్రాంగ్ స్క్రిప్ట్ మీద వెళ్లాం. త్వరలోనే మీ ముందుకు సినిమాను తీసుకొస్తున్నాం. మీ అందరికీ తప్పకుండా మూవీ నచ్చుతుంది. అన్నారు.
 
 హీరోయిన్ విహాన్షి హెగ్డే మాట్లాడుతూ, నా క్యారెక్టర్ లో ఎన్నో షేడ్స్ ఉంటాయి. కథలో కమర్షియల్ అంశాలతో పాటు మెసేజ్ కూడా ఉంది. తెలుగు ప్రేక్షకులు ‘ఓ అందాల రాక్షసి’ సినిమాను ఆదరిస్తారని కోరుకుంటున్నా. మీ అందరికీ నచ్చేలా సినిమా ఉంటుంది. అన్నారు.
 
మరో హీరోయిన్ నేహా దేశ్‌పాండే మాట్లాడుతూ,  వుమెన్ ఓరియెంటెడ్ మూవీలా ఉంటుంది.  భాష్యశ్రీ గారి స్క్రిప్ట్ ఆకట్టుకుంటుంది. ప్రేక్షకుల మనసులకు టచ్ అయ్యేలా మంచి కంటెంట్ తో ‘ఓ అందాల రాక్షసి’ సినిమా రాబోతోంది. మీ సపోర్ట్ మా సినిమాకు అందిస్తారని కోరుకుంటున్నా. అన్నారు.
 
తారాగణం: విహాన్షి హెగ్డే, షెరాజ్ మెహదీ, కృతి వర్మ, నేహా దేశ్‌పాండే, సుమన్ తల్వార్, తమ్మారెడ్డి భరద్వాజ్, అనంత్ బాబు, ప్రియా, కృష్ణ,