సంబంధిత వార్తలు
- రంగస్థలం తర్వాత నేను చూసిన సినిమా పొట్టేల్ : డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా
- కమిట్మెంట్ ఇస్తే ఓ రేటు.. ఇవ్వకపోతే మరో రెమ్యునరేషనా? ఘాటుగా రిప్లై ఇచ్చిన అనన్య నాగళ్ల (Video)
- ఆకాశంలో పొట్టేల్ ప్రమోషన్.. పాంప్లేట్లు పంచారు.. (video)
- పొట్టేల్ నుంచి పటేల్ గా అజయ్ పవర్ ఫుల్ లుక్ రిలీజ్
- యువ చంద్ర కృష్ణ, అనన్య నాగళ్ల రూరల్ యాక్షన్ డ్రామా పొట్టేల్ థియేట్రికల్ రిలీజ్
హీరోయిన్లకు కమిట్ మెంట్స్ వుండవు : అనన్య నాగళ్ల
Ananya Nagalla
ఈ సందర్భంగా అనన్య నాగళ్ల ఓ మహిళా విలేకరి అడిగిన ప్రశ్నకు, మీరు పొరపడుతున్నారు. కమిట్ మెంట్స్ అనేవి హీరోయిన్లకు వుండదు. కథ, బేనర్ నచ్చితేనే సినిమాలో నటించడానికి ఎవరైనా అంగీకరిస్తారు. మీ ద్రుక్పథాన్ని మార్చుకోండని ఘాటుగా స్పందించింది.
ఇంకా చిత్రవిజయాన్ని గురించి మాట్లాడుతూ... సినిమాకి ప్రేక్షకులు నుంచి వస్తున్న రెస్పాన్స్ అద్భుతం. మేము ఊహించిన దాని కంటే చాలా గొప్పగా రెస్పాన్స్ వస్తుంది. ప్రీమియర్స్, ఫస్ట్ డే కి ఆడియన్స్ వచ్చి ఇంత సపోర్ట్ ఇవ్వడం చాలా ఆనందంగా ఉంది. థాంక్యూ సో మచ్ ఆడియన్స్. ధియేటర్స్ 100% ఫీల్ అయ్యాయి. ఒక చిన్న సినిమాకి ఈ మధ్య కాలంలో ఇంత మంచి రెస్పాన్స్ రాలేదు. సాహిత్ ఒక అద్భుతమైన కథని చాలా గొప్ప గా మలిచాడు. చూసినకొద్ది చూడాలనిపిస్తుంది.
నా రోల్ గురించి చాలా మంది ప్రత్యేకంగా మాట్లాడుతున్నారు. ఆడియన్స్ బుజ్జమ్మ అని పిలుస్తుంటే చాలా ఆనందంగా వుంది. నిర్మాతలు చాలా పాషన్ తో సినిమా చేశారు. యువ చాలా అద్భుతంగా నటించారు. అందరికీ థాంక్ యూ సో మచ్. ఫ్యామిలీ ఆడియన్స్ ఇంకా రావాలి. మాత్రుదేవో భవ సినిమాకి ఎలా కనెక్ట్ అయ్యారో ఈ సినిమాకి కూడా అలానే కనెక్ట్ అవుతారు. అందరూ వచ్చి ఈ సినిమాని థియేటర్స్ లోనే ఎక్స్ పీరియన్స్ చేయాలి' అన్నారు.
తర్వాతి కథనం
