శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : శనివారం, 9 అక్టోబరు 2021 (17:51 IST)

పాట మిన‌హా టాకీ పూర్త‌యిన‌ గ్యాంగ్‌స్ట‌ర్ గంగ‌రాజు- బర్త్‌డే లుక్ విడుద‌ల‌

Laksh Chandilawada
హీరో ల‌క్ష్ చ‌ద‌ల‌వాడ `వలయం` వంటి సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రంతో ఆకట్టుకున్న త‌ర్వాత నటిస్తున్న తాజా చిత్రం `గ్యాంగ్‌స్ట‌ర్ గంగ‌రాజు`. వైవిధ్య‌మైన అంశంతో తెరకెక్కుతున్న ఈ చిత్రం నుంచి ఫస్ట్ లుక్ , ఓ పాట కూడా విడుదల కాగా వాటికి ప్రేక్షకుల నుంచి భారీ స్పందన దక్కింది. సినిమా పై కూడా అంచనాలు పెంచాయి. కాగా ఈరోజు హీరో ల‌క్ష్ చ‌ద‌ల‌వాడ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు ఈ చిత్ర బృందం శుభాకాంక్షలు తెలిపింది. 
 
ఈ చిత్రంలో ల‌క్ష్ కొత్తరకమైన, ప్రేక్షకులు మెచ్చే పాత్ర ను చేస్తున్నాడు. పాత్ర కోసం అయన తన మేకోవర్ ను పూర్తిగా మార్చుకున్నారని ఫస్ట్ లుక్ చూస్తే అర్థమవుతుంది.  యువ ద‌ర్శ‌కుడు ఇషాన్ సూర్య దర్శకత్వం అందిస్తుండగా శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిలిమ్స్  పతాకంపై చదలవాడ బ్రదర్స్ సమర్పణలో మంచి అభిరుచి గల నిర్మాత పద్మావతి చదలవాడ ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. టాకీ పార్ట్ మొత్తం పూర్తి చేసుకున్న ఈ సినిమాలోని ఓ పాట షూటింగ్ మాత్రమే బాలన్స్ ఉంది. త్వరలోనే థియేటర్లలో ఈ సినిమా ను విడుదల చేయడానికి సిద్ధం చేస్తున్నామని నిర్మాత తెలిపారు.
 
న‌టీనటులు: ల‌క్ష్ చ‌ద‌ల‌వాడ‌, వేదిక ద‌త్త‌, వెన్నెల కిషోర్‌, చ‌ర‌ణ్ దీప్‌, శ్రీకాంత్ అయ్యంగార్, గోప‌రాజు ర‌మ‌ణ‌, నిహార్ క‌పూర్‌, రాజేశ్వ‌రి నాయ‌ర్‌, స‌త్య‌కృష్ణ‌, ర‌వితేజ‌, న‌న్నిమాల‌, స‌మ్మెట గాంధీ, రాజేంద్ర‌, అను మాన‌స‌, లావ‌ణ్య రెడ్డి, అన్న‌పూర్ణ త‌దిత‌రులు
 
సాంకేతిక వ‌ర్గం:  సినిమాటోగ్ర‌ఫీ:  క‌ణ్ణ పి.సి., సంగీతం:  సాయి కార్తీక్‌, ఎడిట‌ర్‌:  అనుగోజు రేణుకా బాబు,  ఫైట్స్‌:  డ్రాగ‌న్ ప్ర‌కాశ్‌, కొరియోగ్రాఫ‌ర్స్‌:  భాను, అనీష్‌